నా తోడబుట్టిన అన్నతోపాటు నా ఈ ప్రజాప్రస్థాన పాదయాత్రలో 1600 కిలోమీటర్ల పైగా నాతో నడిచి, నాకు దేవుడిచ్చిన తోబుట్టువుల్లా రక్షణగా నిలిచిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి రాఖీ పండుగ శుభాకాంక్షలు…అంటూ తన సోదరుడు..ఏపీ సీఎం జగన్ పేరు ప్రస్తావించకుండానే రాఖీ శుభాకాంక్షలు చెప్తూ వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల ట్వీట్ చేసారు. కొంతకాలంగా వై ఎస్ కుటుంబం లో విభేదాలు ఉన్నాయని ప్రత్యర్థి పార్టీలు.. ప్రతిపక్ష మీడియా కధనాలు వండి వారుస్తున్న టైమ్ లో ఈ ట్వీట్ వైరల్ అయింది. తెలంగాణలో పార్టీ ఏర్పాటు నుంచి ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందని కధనాలు వినిపిస్తున్న సమయం లో ఈ ట్వీట్ రాజకీయం గా కొత్త చర్చ కు దారి తీసింది.. ఇడుపులపాయ లో వైఎస్సార్ జయంతి, వర్ధంతి నాడు మాత్రమే అన్నా – చెల్లెలు ఎదురు పడిన సందర్భాలు ఉన్నాయి. చాలా సందర్భాలలో పక్క రాష్ట్రం గురించి తన దగ్గర ప్రస్తావించొద్దు అంటూనే తమ ఇద్దరి మధ్య భిన్నాభిప్రాయలే కానీ..అభిప్రాయ బేధాలు లేవని చెప్పుకొచ్చిన షర్మిల తెలంగాణలో తన పొలిటికల్ ఎంట్రీ ప్రకటన సమయంలో తాను పార్టీ ఏర్పాటు ఇష్టం ఉన్నా లేకున్నా..ఈ జన్మకు ఆయనే తన అన్న అని ఉద్వేగంగా చెప్పారు.రాఖీ నాడు తన అన్నకు రాఖీ కట్టి శుభాకాంక్షలు చెబుతానాన్న ఆమె రక్షా బంధన్ కావటంతో తోడబుట్టిన అన్నతోపాటు అంటూ షర్మిల ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు ఈ ట్వీట్ భిన్నస్వరాలతో అటు వైస్పార్టీపీలో..వైసీపీలో వైరల్ అవుతోంది.