యుద్ధానికి వారాహి సిద్ధం…

2024 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే ద్యేయం గా జనసేనాని యాత్రను ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. అక్టోబర్ లో యాత్ర చేయాలనుకున్నా పలు కారణాల కారణంగా వాయిదా పడిన నేపథ్యంలోనే అత్యాధునిక టెక్నాలజీతో, మెరుగైన హంగులతో వారాహి వాహనాన్ని సిద్ధం చేసారు. ఈ వాహనంలోనే జనసేనాని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. తన ప్రచార వాహనానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఈ మేరకు ట్వీట్ చేశారు. ఈ వాహనానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ ఎన్నికల యుద్ధానికి వారాహి సిద్ధం అంటూ ఆయన క్యాప్షన్ ఇచ్చారు. వాహనం చుట్టూ బాడీ గార్డులు నడుచుకుంటూ వాహనం రెండు వైపులా ఇద్దరు నిల్చున్న వీడియోను పవర్‌ఫుల్‌గా చిత్రీకరించారు. వారహి వాహనాన్ని పరిశీలిస్తున్న ఫొటోలను కూడా ఆయన పంచుకున్నారు. ఈ వాహనానికి వారాహి అమ్మవారి పేరుపెట్టారు. అన్ని దిక్కులను కాచే అమ్మవారిగా పురాణాలు చెబుతాయి. దుర్గా దేవి సప్త మాతృకల్లో వారాహి అమ్మవారు ఒకరు. ఆ సప్త మాతృకలు రక్త బీజుడు అనే రాక్షసుడిని సంహరించారు. అందుకే తన ప్రచార వాహనానికి పవన్ కళ్యాణ్ వారాహి అని పేరు పెట్టారు. ఈ వాహనం ట్రయల్ రన్‌ను పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో పరిశీలించారు. వాహనానికి సంబంధించి కొన్ని ముఖ్య సూచనలను పార్టీ నాయకుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌కు ఇచ్చారు. వాహనాన్ని తీర్చిదిద్దుతున్న సాంకేతిక నిపుణులతోను చర్చించారు. ప్రస్తుతం అదిరిపోయే లుక్‌తో అత్యాధునిక వసతులతో పవన్ కళ్యాణ్ యాత్రకు వారాహి వాహనం రెడీ అయింది. పవన్ కళ్యాణ్ ఈ వాహనాన్ని దగ్గర ఉండి రెడీ చేయించారు. ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ మార్పులను సూచించారు. పుణేలో వాహనాన్ని తయారు చేయించాలని పార్టీ నేతలు అనుకోగా తరువాత పవన్ సలహా మేరకు హైదరాబాద్‌లోనే సిద్ధం చేయించారు. ఇప్పటి వరకూ పార్టీల నేతలు వాడిన బస్సులకు భిన్నంగా వారాహి తయారవుతోంది. వాహనం టైర్లు చూసినా పెద్ద పెద్ద టైర్లను అమర్చారు. ఈ వెహికల్ లో మెుత్తం ఆరుగురు కూర్చొని మాట్లాడుకునేలా సిట్టింగ్ రూమ్ ఏర్పాటు చేస్తున్నారు. వాహనం చుట్టూ ఎప్పటికప్పుడు పరిశీలించేలా సీసీ కెమెరాలు పెడుతున్నారు. వాహనం బాడీకి రెండు వైపులా సెక్యూరిటీ సిబ్బంది నిలుచునేలా తయారు అవుతోంది. అంతేకాదు వాహనం టాప్ పైకి పవన్ చేరుకునే విధంగా పవర్ లిఫ్ట్ సిస్టం కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా సమాచారం. సౌండ్, లైటింగ్ సిస్టం కూడా ఏర్పాటు చేశారు. అత్యాధునిక సౌకర్యాలతో వారాహి వాహనం రెడీ అవుతోంది. ఈ వాహనం ద్వారా ఆంధ్రప్రదేశ్ మొత్తం యాత్ర నిర్వహిస్తూ వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పవన్ మాట్లాడుతారని తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ చైతన్య రథాన్ని పోలి ఉండేలా పవన్ వారాహి ఉందనే చర్చ నడుస్తోంది.

Related posts

చంద్రబాబే నంబర్ వన్

ఎవరో ఒకరు నాయకత్వం తీసుకోవాల్సిందేనా..?

ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి….-నిర్మాత నట్టి కుమార్ ఫైర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More