గుజరాత్ లో మోత.. హిమాచల్ లో కోత… ఒకచోట మాత్రమే పనిచేసిన మోడీ మంత్రం..

భారతీయ జనతా పార్టీ తన పుట్టినిల్లు లాంటి గుజరాత్ ను రికార్డు మెజారిటీతో ఏడోసారి తిరిగి నిలబెట్టుకున్నా.. హిమాచల్ లో మాత్రం అధికారం కోల్పోయే దిశగా వస్తున్న ఫలితాలు ఆ పార్టీని డోలాయమానం లోకి నెట్టేసింది. ఇరవైఏడేళ్లు అధికారంలో ఉన్న బిజెపి గుజరాత్ లో గతంలో ఎప్పుడు సాదించనటువంటి ఘనమైన మెజారిటీని సాధించిన ఆ పార్టీ ఈ విజయం కేవలం నరేంద్ర మోది ది మాత్రమే అని చెప్పుకుంటూ సంబరాలు చేసుకుంటుంది.. నిజమే అంత గొప్ప విజయమే.. మరి అక్కడ పని చేసిన మోదీ మాత్రం హిమాచల్ లో ఎందుకు వికటించిందో ఇప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఆపార్టీకి ఏర్పడింది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు అన్నీ హిమాచల్ ప్రదేశ్ పై ముందే ఇచ్చిన ప్రిడిక్షన్ మేరకే నువ్వా నేనా అన్నట్టు వచ్చినప్పటికి కాంగ్రెస్ మాత్రం సునాయాసంగానే మ్యాజిక్ ఫిగర్(35) ను దాటేసింది. అధికారం లోకి రావడం ఖాయమైంది. నిజానికి భాజపా అనుకూల మీడియా గానీ భారతీయ జనతా పార్టీ నాయకులు గానీ కాంగ్రెస్ పార్టీ దెబ్బతిందని కనుమరుగు కాయం అన్న ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నిజానికి ఇబ్బంది వచ్చింది కేవలం భారతీయ జనతా పార్టీ కి మాత్రమే అధికారం లో ఉన్న రెండు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం చేజారి పోతుంది అంటే అది ఆ పార్టీ కి మాత్రమే తగిలిన పెద్ద దెబ్బ. అయితే రిసార్ట్ రాజకీయాలను కాంగ్రెస్ నుంచి అందిపుచ్చుకున్న బిజెపి తిమ్మిని బమ్మి చేసి ఏదోలా కాంగ్రెస్ నుంచి తిరిగి రాష్ట్రాన్ని లాగేసుకోవచ్చేమో అన్న నమ్మకం మీదే వుండే వాటినే నమ్ముకుందేమో హిమాచల్ పై మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. గుజరాత్లో ఐదు స్థానాల్లో తన ఉనికి ప్రదర్శించి కాంగ్రెస్ గెలుపు స్థానాలను దెబ్బ కొట్టి జాతీయ పార్టీగా అవతరిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీకి హిమాచల్ ఓటర్లు మాత్రం గట్టిగానే దెబ్బ కొట్టారు.. మ్యాజిక్ నెంబర్ ను దాటి నలబై సీట్లు గెలుపొందిన కాంగ్రెస్ అధికారం లో రానున్న సంబరం అంతంతమాత్రం గానే ఉంది. పూర్తి మెజార్టీ సాదించినప్పటికి కూడా గెలుపొందిన అభ్యర్థులను ఎలా కాపాడుకోవాలన్న ఆతృత తోనే ఉంది. కొత్తగా ఎలెక్ట్ అయిన ఎమ్మెల్యేల వ్యవహారాలను స్వయంగా ప్రియాంక గాంధీ పర్యవేక్షిస్తుందంటే ఆ తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు హిందూ ప్రభావిత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ మరోసారి సెంటిమెంట్ నే గెలిపించి.. మెజార్టీ సీట్లు గెలుచుకుని అధికారంలోకి రానున్న కాంగ్రెస్ మాత్రం దినదిన గండం దీర్ఘాయుష్షు ను తలచుకుని స్థబ్దు గా ఉంది.

Related posts

చంద్రబాబే నంబర్ వన్

ఎవరో ఒకరు నాయకత్వం తీసుకోవాల్సిందేనా..?

ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి….-నిర్మాత నట్టి కుమార్ ఫైర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More