ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన నిమిత్తం విశాఖ రానున్న సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రధానిని నేరుగా కలిసి కొన్ని విషయాల పై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పవన్ విశాఖ టూర్ ని జనసేన , పీఎంఓ వర్గాలు స్పష్టం చెయ్యడం తో ఆ ఇద్దరి బేటీ లో ఎం చర్చ జరగనున్నదనేది ఆశక్తిగా మారింది. అయితే ఈ విషయంపై అటు బీజేపీ నేతలు గాని జనసేన నేతలు గాని అధికారం గా ప్రకటించక పోయినప్పటికీ పవన్ విశాఖ టూర్ షెడ్యూల్ ను చూస్తే అది నిజమని స్పష్టం అవుతుంది. అయితే వీరిద్దరి భేటీలో ఏ విషయం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంటుందా అని పలువురు ఆలోచిస్తున్నారు. జనవాణి కార్యక్రమంలో భాగంగా విశాఖకు వచ్చిన పవన్ కళ్యాణ్ ను ఆ కార్యక్రమానికి హాజరు అవ్వకుండా తన బస చేసిన హోటల్ లోనే మూడు రోజులపాటు పోలీసులు బయటకు రానివ్వకుండా నిర్బంధించడం, అలాగే ఎయిర్పోర్టులో మంత్రులపై దాడి చేశారననే అభియోగాలతో కీలక జనసేన నేతల పై కేసులు నమోదు చేసి అక్రమ అరెస్టులు చేయడంపై పవన్ ప్రధాని మోడీ తో భేటీ సందర్భంగా ప్రస్తావించునున్నట్లు తెలుస్తుంది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం పై కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించునున్నారనే సమాచారం. అయితే ఇక్కడ ప్రధాని కూడా కొన్ని అంశాలపై పవన్ తో చర్చించే అవకాశం ఉందని సమాచారం. జనసేన- బిజెపి కలిసి వచ్చే ఎన్నికలలో పోటీ చేయనున్నట్లు బిజెపి నేతలు అధికారికంగా స్పష్టం చేయడం జరిగింది. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మాత్రం బిజెపి నేతలు సరైన విధంగా స్పందించకుండా ఉండటంపై పవన్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఒకరిద్దరు నేతలు మినహా మిగతా బిజెపి నేతలు వైకాపాకు అనుకూలంగా విహరిస్తున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బిజెపితో పొత్తుపై పవన్ పునరాలోచనలో పడ్డట్లు సమాచారం. వైకాపాకు సపోర్ట్ చేస్తారా ? లేదా జనసేనకు మద్దతుగా నిలుస్తారా అనే విషయాల పై పవన్ నేరుగా మోడీని కలిసి చర్చించే అవకాశం ఉన్నట్లు జనసేన నేతలు చెబుతున్నారు. వీరిద్దరి భేటీ అనంతరం విశాఖలో పవన్ కళ్యాణ్ పలు ప్రాంతాలలో పర్యటిస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఒకవేళ పవన్ పర్యటన ఉంటే ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో పవన్ విశాఖ చేరుకుని ఆదేరోజు రాత్రి ప్రధాన మంత్రి తో డేగ సర్కార్ చోళ లో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. అయితే మోదీ సభకు హాజరై అవకాశం ఉంటుందా లేదా అన్నదానిపై మాత్రం స్పష్టత రాలేదు. పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన, ప్రధానితో భేటీ అంశాలపై మాత్రం అధికార వైకాపా పార్టీ నిశితంగా గమనిస్తుంది. సమయానకూలంగా, సందర్భానుసారం స్పందించాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తుంది.