ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న కళ్యాణ్ రామ్ “అమిగోస్” టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాజేంద్రరెడ్డి దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న నూతన చిత్రానికి సంబంధించి టైటిల్ ను, ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ చిత్రానికి “అమిగోస్” టైటిల్ ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో ఏకంగా కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో నటించనున్నారు. చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తోంది. అలాగే కళ్యాణ్ రామ్ మూడు పాత్రలూ ఆసక్తికరంగానే ఉన్నాయి. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఫిబ్రవరి 10, 2023లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్నో ఏళ్లుగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్ కు ‘బింబిసార’తో ఆ కల నెరవేరింది. ఈ ఒక్కచిత్రంతో కళ్యాణ్ రామ్ క్రేజ్ అమాంతం పెరిగింది. దీంతో ఆయన తదుపరి చిత్రాలపై అభిమానులు, ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కళ్యాణ్ రామ్ కూడా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరించేందుకు ఏకంగా మూడు చిత్రాల్లో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాజేంద్రరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న “అమిగోస్” చిత్రం ఉంది. ఆ తర్వాత సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మాణంలో చేస్తున్నారు. దీనికి `118` హిట్‌ చిత్రాన్ని అందించిన కేవి గుహన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే నవీన్‌ మేడారం దర్శకత్వంలో పీరియాడికల్‌ స్టోరీతో `డెవిల్‌` అనే చిత్రంలో నటిస్తున్నారు. దీన్ని అభిషేక్‌ పిక్చర్స్ నిర్మిస్తుంది. బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌ నేపథ్యంలో `డెవిల్‌`చిత్రం రూపొందుతుంది. అలాగూ ఈస్‌కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్‌ కోనేరు నిర్మాణంలో మరో చిత్రం కూడా రానున్నట్లు తెలుస్తుంది. ఇది వచ్చే ఏడాదిసెట్స్ పైకి వెళ్లనుంది. బింబిసారా హిట్ తో కళ్యాణ్ రామ్ వరుస ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉన్నారు.

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More