కేంద్రం పై , బీజేపీ పై కేసీఆర్ యుద్ధం ప్రకటించిన దగ్గరనుంచి రెండు పార్టీల మధ్య మరింత ఎడం పెరిగింది.. మోదీ ను ఒకప్పుడు ఆకాశానికి ఎత్తేసిన కేసీఆర్ కి ఇప్పుడు మోదీ అంటేనే అసలు పడటం లేదు.. ఏ అవకాశం వచ్చినా కేంద్రం పై దుమ్మెత్తి పొయ్యాడానికి తెలంగాణ సీఎం వెనుకాడటం లేదు.. తెలంగాణ బీజేపీ ‘సాలుదొర.. సెలవు దొర’ క్యాంపెయిన్ మొదలెట్టిన దగ్గరనుంచి ఈ యుద్ధం ప్రకటనల వార్ గా రూపాంతరం చెందింది..గత జూలై లో భారతీయ జనతా పార్టీ జాతీయ మహా సభలకు ప్రధాని హైదరాబాద్ వచ్చినప్పుడు బీజేపీ ప్రధాని స్వాగత హోర్డింగ్ లు ఏర్పాటు చేసుకోడానికి గాని జాతీయ సభల ప్రచారానికి ఎక్కడా అవకాశం ఇవ్వకుండా హోర్డింగ్ లు మెట్రో పిల్లర్స్ పై టీఆరెస్ ప్రభుత్వ విజయాల ప్రకటన లతో నింపేశారు.. అప్పుడు బీజేపీ రోడ్లను ఇతర ప్రచార సాధనాలు ఉపయోగించుకుంది.. తరువాత స్వాతంత్ర్య వజ్రోత్స్వవాలను కూడా పోటాపోటీగా నిర్వహించింది.. ఇప్పుడు మళ్లీ విలీన వజ్రోత్సవాల వంత్తోచ్చింది.. కేంద్రం సెప్టెంబర్17 విలీనోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని అనుకున్న వెంటనే రాష్ట్రం కూడా వజ్రోత్సవం పేరిట అధికారికం నిర్వహించాలని నిర్వహించింది. అంత వరకు బాగానే వుంది.. మళ్ళీ ప్రకటన ల విషయం వచ్చేసరికి కధ మొదటికొచ్చింది. మెట్రో పిల్లర్ల పై బోర్డు లు ఏర్పాటు చేయాలనుకున్న బీజేపీకి మెట్రో యాడ్ ఏజన్సీ ల నుంచి ఎదురు దెబ్బ తగిలింది.. ప్రకటన లకు పిల్లర్లు ఇవ్వలేమని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న యాడ్ ప్లేస్ లను బుక్ చేసుకోవడం వలన వేరే ఎవరికి ఇచ్చే పరిస్థితి లేదని తేల్చిచెప్పింది.. ఉత్సవాలకు హైదరాబాద్ ను కాషాయమయం చెయ్యాలని బీజేపీ , గులాబీమయం చెయ్యాలని టీఆరెస్ పోటీని మొదలుపెట్టాయి.. మళ్ళీ మొదలైన పోరు ఎలా టర్న్ తీసుకుంటుందో.. కేంద్ర పెద్దలు రంగం లోకి దిగి సమస్య పరిష్కరిస్తారో లైట్ అనుకుంటారో.. చూడాలి.