వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న టిడిపినేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మళ్ళీ ట్రాక్ లోకి వచ్చినట్టే కనిపిస్తున్నారు. వైస్సార్ సీపీ ప్లీనరీ లో సి ఎం జగన్ విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు అంటూ “నాడు – నేడు” గురించి చేసిన సుదీర్ఘ ఉపన్యాసం పై కౌంటర్ ఇచ్చారు. ఆ పథకాన్ని సృష్టించింది, రూపకల్పన చేసింది, నిధులు తెచ్చి నిబంధనలు రూపొందించిందీ, పనులు ప్రారంభించింది ఆనాటి తెలుగుదేశం పార్టీయేనని అప్పటి మానవ వనరుల శాఖా మంత్రి గా హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) కింద పలు సమావేశాలు నిర్వహించి ఎక్స్పర్ట్ కమిటీ ని లీడ్ చేసి పథకాన్ని అమలు చేసింది చేసింది తామే నాని చెప్పుకోవడం ద్వారా స్వామి కార్యం స్వకార్యం రెండిటికి పూనుకున్నట్టయింది. రాష్ట్రంలో టీడీపీ కి కాస్త మైలేజ్ పెరుగుతుందని గుర్తించారో ఏమో మళ్ళీ పసుపు స్వరాన్ని అందుకున్నారు. ఒకానొక దశలో వైసీపీలో కూడా చేరుతారనే ముమ్మర ప్రచారం జరిగింది.కానీ ఆయన అటు వైసీపీలో చేరక,ఇటు టిడిపిలో యాక్టివ్ గా ఉండగా స్తబ్దుగా ఉంటూ తన పనేదో తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అధికార పార్టీ ప్రజావ్యతిరేక పాలనను వ్యతిరేకిస్తూ టిడిపి నేతలు చేసిన పోరాటాలు ధర్నాలు, రాస్తారోకోలు, ప్రదర్శనలు, మీడియా సమావేశాలు వీటిల్లో ఎక్కడా కానరాని గంటా లో మార్పు మొదలైంది. అసలు టిడిపిలో ఉన్నారా లేదా అన్న సందేహాలు తలెత్తాయి. గంటా వ్యవహారశైలిపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు విశాఖ టిడిపి నాయకత్వం ఫిర్యాదు కూడా చేసిందికూడా అయితే తొందరపడి చర్యలు తీసుకోవడం మంచిది కాదని ఆచితూచి వ్యవహరించాలని పార్టీ కేడర్ కు చంద్రబాబు నాయుడు అప్పట్లోనే సూచించారు. అధినేత సూచనలతో ఎటువంటి విమర్శలు చేయకుండా టిడిపి నాయకత్వం కూడా సైలెంట్ అయింది.ఇటు అధికార పార్టీ లోకి చేరలేక అటు టిడిపి పార్టీకి దగ్గరగా ఉండలేక ఒక విధమైన సంకట స్థితిలో ఉన్న గంటా శ్రీనివాసరావు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కొనసాగుతున ఉద్యమంలో పాల్గొనేందుకు సిద్ధమై మరోసారి తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు.ఈ ఉద్యమములో భాగంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా కూడా చేసారు. గంటా శ్రీనివాస రావు పార్టీని వదిలి వెళ్ళక ముందే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అతనిని పార్టీ నుంచి బహిష్కరిస్తారనే ప్రచారం కూడా బాగానే సాగింది. జిల్లాల పర్యటనలో భాగంగా విశాఖ వచ్చిన చంద్రబాబు నాయుడును గంటా శ్రీనివాసరావు కలిసి పార్టీ గురించి, రానున్న ఎన్నికల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు మీడియాలో కూడా బాగా హైలెట్ అయ్యాయి. వచ్చే ఎన్నికలలో గంటా శ్రీనివాసరావు మళ్ళీ భీమిలి నియోజకవర్గం నుంచే బరిలోకి దిగేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలలో విశాఖలో టీడీపీని గెలిపించే బాధ్యతను కూడా తానే తీసుకుంటున్నట్లు సమాచారం. అధికార పార్టీ పాలనపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అది తమకు కలిసి వస్తుందనే టిడిపి నేతలు భావిస్తున్నారు. జనసేన పార్టీతో పొత్తు విషయంపై ఒక క్లారిటీ వస్తే తర్వాత పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగాలని గంటా శ్రీనివాసరావు ఆలోచిస్తున్నట్లు అందులో భాగంగానే మళ్ళీ ఏక్టివ్ పాలిటిక్స్ మొదలుపెటైనట్టు సమాచారం.