నిబంధనలను ఉల్లంఘిస్తే ఇకపై డిజిటల్ న్యూస్ సైట్స్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్రెస్ అండ్ పీరియాడికల్స్ బిల్‌కు సమాచార ప్రసార శాఖ తుది మెరుగులు దిద్దుతోంది. అందులో కొత్తగా ఏదైనా ఎలక్ట్రానిక్ డివైజ్‌పై డిజిటల్ మీడియా ద్వారా వార్తలు అనే అంశాన్ని కూడా చేర్చింది. ఈ బిల్లు చట్టంగా మారిన 90 రోజుల లోపు డిజిటల్ న్యూస్ పబ్లిషర్లు తమ సైట్ రిజిస్ట్రేషన్ కోసం ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన పబ్లికేషన్లపై చర్యలు తీసుకునే అధికారం ఈ ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్‌కు ఉంటుంది. వాటిలో రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయడం, పెనాల్టీ విధించడం వంటి చర్యలుంటాయి. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా` చైర్మన్ నేతృత్వంలో ఒక అపీలేట్ బోర్డును కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.డిజిటల్ మీడియా ఇప్పటివరకు ఏ చట్టం పరిధిలో కానీ, ఏ నియమనిబంధనల పరిధిలో కానీ లేదు. ఇప్పుడు చేస్తున్న సవరణలతో డిజిటల్ మీడియా కూడా కేంద్ర సమాచార ప్రసార శాఖ నియంత్రణలోకి వస్తుంది. ప్రస్తుతం సవరణలతో కూడిన బిల్లుకు ప్రధాన మంత్రి కార్యాలయం ఆమోదం లభించాల్సి ఉంది. ఈ రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్రెస్ అండ్ పీరియాడికల్స్ బిల్ బ్రిటిష్ కాలంలో వార్తాపత్రికల నియంత్రణ కోసం రూపొందించిన ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ యాక్ట్, 18676 స్థానంలో వస్తోంది. 2019లోనే ఈ తరహా ప్రతిపాదనలో కేంద్రం ముందుకు వచ్చింది. దానిపై, డిజిటల్ మీడియా స్వేచ్ఛను హరించడమేనంటూ పెద్ద ఎత్తున వ్యతిరేకత కూడా వచ్చింది. `ఏదైనా ఎలక్ట్రానిక్ డివైజ్‌పై ఇంటర్నెట్ ద్వారా, ఆడియో, వీడియో, టెక్స్ట్, గ్రాఫిక్స్ రూపంలో, డిజిటల్ ఫార్మాట్‌లో వార్తలను ప్రసారం చేయడాన్ని డిజిటల్ మీడియా న్యూస్`గా నిర్వచిస్తున్నారు.