ప్రముఖ మెసేజింగ్ సంస్థ వాట్సాప్ సేవలకు భారత్ తో సహా ప్రపంచ వ్యాప్తంగా అంతరాయం కలిగింది.. దాదాపు 150 దేశాల్లో 200 కోట్ల మంది యూజర్లు కలిగిన వాట్సాప్ మధ్యాహ్నం 12 గంటలకు 29 నిమిషాల నుంచి పనిచేయడం మానేయడంతో యూజర్స్ అయోమయంలో పడ్డారు సాంకేతిక లోపంతోనే సేవలు నిలిచిపోయారని వీలైనంత త్వరగా పునరుద్ధరిస్తామని వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ల మాతృ సంస్థ అయినటువంటి మెటా తెలిపింది వాట్సాప్ 2009 నవంబర్లో ప్రారంభమై 2010 లో ఆండ్రాయిడ్ మొబైల్స్ కు సేవలను అందించడం మొదలుపెట్టింది ఈ 12 సంవత్సరాలలో చాలాసార్లు సాంకేతిక లోపాలతో వాట్సాప్ పని చేయనప్పటికీ ఇటీవల కాలంలో వాట్స్అప్ వినియోగం విపరీతంగా పెరగడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుబాటు లో వేరే మాధ్యమాలలో వాట్సప్ తమ అసహనం తెలుపుతున్నారు…మెసేజ్ లో కేవలం సింగిల్ టిక్ రావడం తో తొలుత ఇంటర్నెట్ సమస్య అనుకున్న నెటిజన్లు తరువాత అదికూడా రాకుండా ఎక్కడి మెసేజ్ లు అక్కడే గప్ చుప్ అన్నట్టు ఉండిపోవడం తో తొందరపడి వాట్సాప్ కి ముందే గ్రహణం పట్టిందని మీమ్స్ వదులుతున్నారు.. సమస్య ను తొందరగా పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నామని.. హ్యక్ అవకాశమే లేదని మెటా అభిప్రాయం వ్యక్తం చేసింది