సంక్రాంతికి బిగ్ ఫైట్

సంక్రాంతి కి టాలీవుడ్ లో బిగ్ ఫైట్ తప్పేట్టు లేదు. ఈ సారి పోటీ లో ఇద్దరు సీనియర్ హీరోలతో పాటు పాన్ ఇండియన్ హీరో, తమిళ్ హీరో బాక్సాఫీసు వద్ద పోటీ పడనున్నారు. ఈ నాలుగు చిత్రాలు కూడా పెద్ద బ్యానర్ల నుంచి పెద్ద హీరోలతో వస్తున్నవే. భారీ కలెక్షన్ల టార్గెట్ గా వీటిని రిలీజ్ చేస్తున్నారు. నాలుగు చిత్రాల మధ్య క్లాష్ వస్తున్నప్పటికి కూడా దర్శక నిర్మాతలు అసలు ఎక్కడా తగ్గడం లేదు. మా చిత్రంపై పూర్తి నమ్మకం ఉందని, భారీ కలెక్షన్లు వసూలు చేసి, రికార్డులు క్రియేట్ చేస్తుందని ఎవరికి వారే చెప్పుకుంటున్నారు. సుమారుగా ఈ నాలుగు చిత్రాలు ఒకరోజు తేడాలో రిలీజ్ అవుతున్నాయి. నాలుగు ఒకేసారి రిలీజ్ అవుతుండటంతో భారీ కలెక్షన్ల లను నాలుగు చిత్రాలు షేర్ చేసుకోవలసి ఉంటుంది. ఒకవేళ ఈ చిత్రాలు విజయం సాధించినప్పటికీ అనుకున్నట్లుగా వసూళ్లు అయితే రావన్నది సినీ విశ్లేషకులు చెబుతున్నారు. సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, ప్రభాస్, తమిళ్ హీరో విజయ్ లు భారీ ప్రాజెక్టులతో అవుతున్నారు. సంక్రాంతి 2023 బరిలో బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య జనవరి 11న, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి జనవరి 12న, ఓం రౌత్ దర్శకత్వం ప్రభాస్ నటించిన ఆది పురుష్ జనవరి 12న, పైడిపల్లి వంశీ దర్శకత్వంలో తమిళ్ హీరో విజయ్ నటించిన వారసుడు జనవరి 11న రిలీజ్ అవుతున్నాయి. ఈ చిత్రాలు సంక్రాంతి బరిలో పోటీ పడటానికి సిద్ధంగా ఉండగా.. వీటితో పాటు మరికొన్ని చిన్న సినిమాలను కూడా విడుదలకు సిద్ధం చేస్తున్నారు. వీటిలో ప్రభాస్ నటించిన అది పురుష్ పాన్ ఇండియన్ మూవీ గా రిలీజ్ అవుతుంది. చిరంజీవి, బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలతో ఢీ కొట్టేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నారు. ఇక తమిళ్ హీరో విజయ్ కూడా వారసుడు మూవీ తో నేను కూడా బరిలో ఉన్నానంటూ సిద్ధమవుతున్నారు. టాలీవుడ్ లో సంక్రాంతి అంటే సినిమాల పండగ. దశాబ్దాల నుంచి సంక్రాంతి పోటీ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా టాలీవుడ్ లో సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ ల మధ్య ఈ పోటీ ఎక్కువగా జరుగుతూ ఉండేది. బాలకృష్ణకు ఇండస్ట్రీ హిట్ లు ఇచ్చిన సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయ్యాయి. అలాగే చిరంజీవి కూడా కొన్ని హిట్ చిత్రాలు ఉన్నాయి. పోటీ లో నాలుగు చిత్రాలు ఉన్నప్పటికీ ప్రధాన పోటీ చిరంజీవి, బాలకృష్ణ మధ్య అనే చెప్పక తప్పదు. అఖండ, ఆన్ స్థాపబుల్ సీజన్-1, సీజన్ సీజన్- 2 సక్సెస్ లతో ఉన్న బాలయ్య కు సంక్రాంతి పోటీలో కూడా అదే విజయపరంపరను కొనసాగిస్తారని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. గాడ్ ఫాదర్ మూవీ తో కూడా చిరు సక్సెస్ కొట్టారు. ఆ సక్సెస్ ని కూడా సంక్రాంతి న చిరంజీవి కంటిన్యూ చేస్తారని పేర్కొంటున్నారు. చిరు- బాలయ్య మధ్య పోటీ ఎలా ఉన్నప్పటికీ వారిద్దరి అభిమానుల మధ్య మాత్రం బిగ్ వారే జరగనున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే చిరు, బాలయ్య ల చిత్రాలకు నిర్మాతలు ఒక్కరే కావడంతో ఆ రెండు చిత్రాల మధ్య పోటీ వారికి ఒక సమస్యగా మారింది. ఆ రెండు చిత్రాల మధ్య క్లాష్ రాకుండా ఉండేందుకు ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ బరిలో ఉన్నప్పటికీ పుణ్య కారణాలవల్ల ఈ మూవీని కూడా పోస్ట్ ఫోన్ చేస్తారనే ప్రచారం అయితే జరుగుతుంది. ఇటీవల రిలీజ్ అయిన ఆ సినిమా ట్రైలర్ లో వి.ఎఫ్.ఎక్స్ పై విపరీతమైన ట్రోలింగ్ వచ్చింది. వి.ఎఫ్.ఎక్స్ వర్క్ పై మరింత కాన్సన్ట్రేషన్ చేయడానికి మరికొంత సమయం తీసుకుంటారనే ప్రచారం జరుగుతుంది. ఈ కారణంగా హిందీ మూవీ విడుదల తేది పై సందిగ్దత నెలకొంది. అయితే ఆ మూవీ మేకర్స్ మాత్రం సంక్రాంతి గా వస్తున్నామని పని మాత్రం గట్టిగా చెబుతున్నారు. ఇక తమిళ్ హీరో విజయ్ ద్విభాషా చిత్రం వారసుడు తో టాలీవుడ్ హీరోలతో పోటీ కి రెడీ అవుతున్నాడు. మొత్తంగా చూస్తే వచ్చే సంక్రాంతికి నలుగురి హీరోల మధ్య బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ కు మాత్రం రంగం సిద్దమైంది..

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More