ఎన్టీఆర్ ను ముట్టడిస్తున్న రాజకీయం…

తన తండ్రి నందమూరి హరికృష్ణ మరణానంతరం జూనియర్ ఎన్టీయార్ పూర్తిగా తన పంథాను మార్చుకుని సినిమాలు, కుటుంబానికే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ వస్తున్నారు. రాజకీయాలకు చాలా దూరంగా ఉంటున్నారు. అప్పుడెప్పుడో ఎన్నికల ముందు టిడిపికి ప్రచారం చేసిన ఎన్టీఆర్ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల అటు రాజకీయాలకే కాకుండా ఇటు నందమూరి కుటుంబానికి కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన పరిణామాలు తరచుగా ఆయనను వార్తల్లో ఉండే విధంగా చేస్తున్నాయి. బిజెపి అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవడమే దీనికి కారణమని ప్రచారం జరుగుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సన్నిహితంగా ఉంటున్న బిజెపి ఇప్పుడు ఎన్టీఆర్ సేవలను కూడా రాజకీయంగా వాడుకోవాలనే ఆలోచనతోనే ఎన్టీఆర్ ను దువ్వుతుంది.. స్టార్ క్యాంపెయినర్ గా ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇక తెలంగాణలో స్టార్ ఇమేజ్ ఉన్న నటుడు కావాలనే ఆలోచనతో బిజెపి ఎన్టీఆర్ వైపు దృష్టి సారించిందనే ప్రచారం కొనసాగుతుంది. అమిత్ షా తో బేటీ మొదలు ఎన్టీఆర్ కు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకంగా మారిందన్న ఆరోపణలు కూడా వెలువెత్తుతున్నాయి. ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఎన్టీఆర్ చేసిన నటనకు ఫిదా అయినా అమిత్ షా అతనిని అభినందించేందుకు ఆ ఇద్దరి భేటీ జరిగిందని బిజెపి శ్రేణులు చెబుతున్నప్పటికీ అసలు మేటర్ బహిరంగ రహస్యమే. అదే మూవీలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కీలక పాత్రలో నటించిన రామ్ చరణ్ ను తక్కువ చేసి చూస్తున్నారని మెగా అభిమానులు గుర్రు గానే వున్నారు.. ఇద్దరిని పిలిచి అభినందిస్తే బాగుండేదని అలా కాకుండా ఎన్టీఆర్ ని ఒకరిని మాత్రమే పిలిచి అతనిని అభినందించడం ద్వారా రామ్ చరణ్ తేజను అవమానించినట్లుగా మెగా అభిమానులు భావిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ రిలీజ్ కి ముందు తర్వాత కూడా చాలా సన్నిహితంగా ఉంటూ వస్తున్న జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానుల మధ్య మరోసారి ఈ వివాదం చిచ్చు రేగింది. దీనికి తోడు అక్కినేని కుటుంబం, దగ్గుబాటి కుటుంబాలు జూనియర్ ఎన్టీఆర్ తో సన్నిహిత్యాన్ని కొనసాగిస్తూ అతనికి సపోర్ట్ గా ఉంటూ వస్తున్నాయి. వాస్తవానికి ఆ రెండు కుటుంబాలు మెగాస్టార్ చిరంజీవికి చాలా దగ్గరగా ఉంటున్నాయి. చిరంజీవి పట్ల ఆ రెండు కుటుంబాలు అమితమైన ప్రేమను, ఇష్టాన్ని చూపిస్తున్నాయి. అయితే మరో కోణంలో జూనియర్ ఎన్టీఆర్ కు సపోర్టుగా ఆ కుటుంబాలు నిలబడుతున్నాయి. సినీ ఇండస్ట్రీలో ఆ రెండు కుటుంబాల కాకుండా చాలామంది సీనియర్ నటులు కూడా ఎన్టీఆర్ పట్ల తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల తర్వాత అంత రేంజ్ ఉన్న ఏకైక నటుడు జూనియర్ ఎన్టీఆర్ అనే చర్చ ఇప్పటికే కొనసాగుతుంది. తను రాజకీయాలలోకి వస్తే మాత్రం ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ మాత్రం ఇప్పట్లో తాను రాజకీయాలలోకి వచ్చే ప్రసక్తి లేదని సన్నిహితుల వద్ద చెప్పినట్లు తెలుస్తుంది. ఇప్పుడు తన దృష్టి అంతా సినిమాల పైన, కుటుంబం పైన ఉన్నదని కొన్ని ప్రత్యేక కారణాల వలన రాజకీయ నాయకులను అయితే కలవచ్చు కానీ ఎట్టి పరిస్థితులలోను ఎన్టీఆర్ పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు అయితే లేవని అంటున్నారు. మరోపక్క ఎన్టీఆర్ అమిత్ షా తో భేటీ కావడం వల్లే అతను ముఖ్య అతిథిగా పాల్గొంటున్న బ్రహ్మాస్త్ర సినిమా ఈవెంట్ కు మొదట అనుమతులు ఇచ్చిన పోలీసులు చివరి నిమిషంలో రద్దు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. తన కెరీర్ ప్రారంభం నుంచి రాజమౌళి కుటుంబంతో సన్నిహితంగా ఉంటూ వస్తున్న ఎన్టీఆర్ కు ఇప్పుడు ఆ సాన్నిహిత్యం వల్ల తనపై ప్రభుత్వం కన్నెర్ర చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ను బిజెపి రాజ్యసభ సీటు ఇవ్వడం కూడా తెలంగాణ ప్రభుత్వానికి అంతగా రుచించలేదు. ఇప్పుడు అదే కుటుంబంతో అంట కాగుతున్న ఎన్టీఆర్ పై రివెంజ్ తీర్చుకోవడానికే తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అతని అభిమానులు ఆరోపిస్తున్నారు. ఎన్టీఆర్ తన తాత నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నాడు. ఇప్పుడు ఆ పార్టీని కాదని బిజెపి పార్టీలో చేరి ఆ పార్టీ తరపున ఎన్నికలకు వెళ్తాడనే ఊహాగానాలు తప్ప అందులో వాస్తవం లేదన్నది రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. బిజెపి చర్యల వల్ల ఇటు మెగా అభిమానులకు, అటు టిఆర్ఎస్ ప్రభుత్వానికి జూనియర్ ఎన్టీఆర్ టార్గెట్ అయ్యాడనే ప్రచారం అయితే జరుగుతుంది.

Related posts

చంద్రబాబే నంబర్ వన్

ఎవరో ఒకరు నాయకత్వం తీసుకోవాల్సిందేనా..?

అయ్యప్ప ఆలయ దర్శనం పై కేరళ సర్కార్ నిర్ణయం ఆమోద యోగ్యమేనా..?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More