ప్రాంతాలకు వర్గాలకు అతీతం గా జరుపుకునే వినాయక చవితి ఉత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాలు సిద్ధమయ్యాయి తెలంగాణ లో ప్రతి గల్లీ లో ఇప్పటికే పెద్ద ఎత్తున పందిళ్లు ఏర్పాటు కాగా ఏపీ లో మాత్రం వినాయకుడికి విఘ్నాలు ఎదురవుతున్నాయి పర్మిషన్ ల పేరిట ప్రభుత్వం అనేక ఆంక్షలు పెడుతుండడం తో హిందు సంఘాలు, ప్రజలు మండి పడుతున్నారు.. ఓ వైపు డీజీపీ పండగ పై ఎటువంటి ఆంక్షలు లేవని చెపుతూనే కఠిన నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు. భద్రతా దృష్ట్యా కొన్ని నిబంధనలు పెట్టడమే తప్పా మరింకేం లేదని చెప్తున్నారు..ఇప్పటికే ఆంధ్రా లో కళ తప్పిన వినాయక చవితి ఈ నిబంధనల తో తూతూ మంత్రం గానే జరగనుంది. ఫైర్, కార్పొరేషన్, పోలీస్ పర్మిషన్ లు సింగిల్ విండో లో కాకుండా వేరువేరు గా తీసుకోవాల్సి రావడం కూడా ఇబ్బంది కర పరిణామామే.. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చవితి పండుగ పై విరుచుకు పడుతుండగా కీలకం గా వుండే కొంతమంది స్వామీజీ లు వ్యూహాత్మక మౌనం పాటిస్తుండడం కూడా విమర్శల పాలవుతుంది. పండుగ చేసుకోడానికి కూడా ఉద్యమాలు చేయాలా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ లో ప్రతి వీధి చవితి పందిళ్ల తో సిద్ధమయ్యాయి.. ప్రతిష్టాత్మక ఖైరతాబాద్ గణేశుడు తుది మెరుగులు దిద్దుకుంటున్నాడు.. ఈ ఏడాది ఎకో ఫ్రెండ్లీ గణేషుడిగా మట్టి వినాయక ప్రతిమను కళాకారులు రూపొందించారు…