అమిత్ షా – జూ ఎన్టీఆర్ ల మధ్య రజాకర్ ఫైల్స్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో భారతీయ జనతా పార్టీ కీలకనేత హోమ్ మంత్రి అమిత్ షా సమావేశం అవ్వడం రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. వాళ్ళిద్దరి మధ్య ఏం చర్చ జరిగింది..? ఎన్టీఆర్‌కు బీజేపీ నుంచి వచ్చిన ఆఫర్ ఏంటి? ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో  చర్చానీయాంశంగా మారింది. ఆర్ఆర్ఆర్’  సినిమాలో కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ కనబరిచిన అభినయం అమిత్ షాను అమితంగా ఆకట్టుకుందని, అందుకని నందమూరి హీరోను అభినందించడానికి కలిశారని కమలం వర్గాలు బయటకు చెపుతున్నప్పటికి అసలు మేటర్ వేరే అంటున్నారు. తెలంగాణ లో కొమురం భీం ని అభిమానించే వాళ్ళు ఎక్కువగానే వున్నారు. ఆ పాత్రలో నటించిన ఎన్టీఆర్‌ను దగ్గరకు తీసుకోవడం ద్వారా వాళ్ళను ఆకట్టుకోవాలనేది బీజేపీ ప్లాన్ అనేది రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట. ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్. దేశవ్యాప్తంగా ఆయనకు ఉన్న క్రేజ్‌ను కూడా రాజకీయాలకు ఉపయోగించుకొని ఎన్టీఆర్‌ హీరోగా హిందుత్వ ఎజెండాతో కూడిన సినిమా చేసే ప్లాన్‌లో ఉన్నారట.   కశ్మీర్‌లో పండిట్లు, హిందువులు ఎదుర్కొన్న కష్టాలను చూపించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ తరహా లో తెలంగాణలో ప్రజలను ఆకట్టుకోవడం రజాకార్ల అకృత్యాలు, నిరంకుశ ధోరణి కళ్ళకు కట్టేలా చూపించడం కోసం ‘ది రజాకార్ ఫైల్స్’ సినిమా తీయనున్నట్టు గతం లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆ మధ్య వెల్లడించారు. అందులో హీరోగా నటించమని ఎన్టీఆర్ ముందుకు అమిత్ షా ప్రతిపాదన తీసుకొచారని బలంగా రాజకీయ వర్గాల్లో వినబడుతోంది. ‘ఆర్ఆర్ఆర్’లో భీం ఫిక్షనల్ క్యారెక్టర్. నిజ జీవితంలో రజాకార్లకు వ్యతిరేకంగా కొమురం భీం పోరాటం చేశారు. అందువల్ల, ‘రజాకార్ ఫైల్స్’లో నటిస్తే… దేశవ్యాప్తంగా మైలేజ్ ఉంటుందని భారతీయ జనతా పార్టీ భావిస్తోందట. అందుకే, ముందుగా ప్లాన్ చేసిన షెడ్యూల్‌లో లేనప్పటికీ… తారక్‌ను ఎన్టీఆర్ కలవడం వెనుక కారణం ఇదే అంటున్నారు.  రాజకీయాలకు ఎన్టీఆర్ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.  కొన్నాళ్ళ క్రితం తెలంగాణలో సోదరి సుహాసిని పోటీ చేసినప్పుడు కూడా ఆయన ప్రచారానికి రాలేదు. సినిమాల పరంగానూ అందరివాడిగా ఎన్టీఆర్ ఉంటున్నారు. ఆయన అభిమానుల్లో అన్ని మతాలు, వర్గాల వారు ఉన్నారు. ఇప్పుడు ‘రజాకార్ ఫైల్స్’ చేయడం ద్వారా ఆయన కొందరికి దూరం అయ్యే ప్రమాదం ఉంది. పైగా, ఆయన మీద హిందుత్వ ముద్ర పడొచ్చు కూడా. బీజేపీ మనిషి అంటే ఉత్తరాదిలో ఒక వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తం కావచ్చు. అందువల్ల, ఈ హిందుత్వ ఎజెండాకు ఎన్టీఆర్ ఒకే చెప్తారా..? అనే డిస్కషన్ కూడా జరుగుతోంది.

Related posts

చంద్రబాబే నంబర్ వన్

ఎవరో ఒకరు నాయకత్వం తీసుకోవాల్సిందేనా..?

ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి….-నిర్మాత నట్టి కుమార్ ఫైర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More