ప్రకృతి భీభత్సం, వరద ఉధృతి కారణంగా అమర్ నాధ్ యాత్ర ను నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.దక్షిణ కశ్మీర్‌లోని అమర్‌నాథ్ గుహ సమీపంలో వరదలు సంభవించిన రెండు రోజుల తర్వాత ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులే ఇందుకు కారణమని వెల్లడించింది. దక్షిణ కాశ్మీర్ హిమాలయాల్లో 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న బేస్ క్యాంప్‌లకు జమ్ము నుంచి కొత్త బ్యాచ్‌లను అనుమతించబోమని స్పష్టం చేశారు. కాశ్మీర్‌లోని రెండు బేస్ క్యాంపులకూ జమ్ము నుంచి యాత్రను నిలిపివేస్తున్నట్టు స్పష్టం చేశారు. అకస్మాత్తుగా క సంభవించిన మెరుపు వరదల్లో వందల సంఖ్యలో కొట్టుకుపోయి ఏకంగా 16 మంది మృతి చెందారు. ఇప్పటికి దాదాపు 40 మంది ఆచూకీ ఇంకా లభ్యంకాలేదు. దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ఉన్న ‘నువాన్-పహల్గం’, మధ్య కాశ్మీర్ బల్టాల్‌లోని ‘గండెర్బల్’ అనే జంట బేస్ క్యాంప్‌ల నుంచి జూన్ 30 అమర్‌నాథ్ యాత్రం ప్రారంభమైంది. ఇప్పటివరకు 1 లక్షకుపైగా భక్తులు ఆలయ దర్శనం చేసుకున్నారు. కాగా జూన్ 29 నుంచి 69,535 మంది యాత్రికులు 10 బ్యాచ్‌లుగా జమ్ములోని భగ్వతి నగర్ బేస్ క్యాంప్ నుంచి బయలుదేరారు. మొదటి బ్యాచ్ యాత్రికులను లెఫ్టనెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి పంపించిన విషయం తెలిసిందే. ఇదిలావుండగా షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 11న అమర్‌నాథ్ యాత్ర ముగియాల్సి ఉంది.