సైబర్ క్రైమ్ , డ్రగ్స్ పై సినిమాల్లో అవగానే కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కి సూచించారు. సినిమా టికెట్లు పెంచామని ప్రభుత్వం దగ్గరకు వస్తున్నారు, కానీ వీటి పై అవగాహన కల్పించడం లేదని వందల కోట్ల బడ్జెట్ సినిమా అయినా సైబర్ క్రైమ్ , డ్రగ్స్ పై అవగాహన కల్పించే విధంగా చిత్రాలు సినిమా కు ముందు ప్రదర్శించాలని కోరారు. సినిమా లో నటించే నటులతో మోటివేషనల్ గా మాట్లాడించిన వీడియో తో అవగానే కల్పించాలన్నారు అలా కల్పించకపోతే వారి సినిమాలకు టికెట్లు పెంచే ప్రసక్తి లేదనీ అలాంటి నిర్మాతలకు , డైరెక్టర్ లకు , తారాగణంకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయ సహకారాలు ఉండవనీ చెప్పారు. సినిమా థియేటర్ల యాజమాన్యాలు కూడా ఈ అవగాహనా కార్యక్రమానికి సహకరించాలనీ విజ్ఞప్తి చేసారు. డ్రగ్స్, సైబర్ నేరాలు పై థియేటర్లు లో ప్రసారం చేయక పోతే మీ థియేటర్లు కు అనుమతి లేదని కూడా హెచ్చరించారు డ్రగ్స్ అవగాహన ప్రకటన లో నటించిన మెగాస్టార్ చిరంజీవి ని ముఖ్యమంత్రి అభినందించారు.