Vaisaakhi – Pakka Infotainment

ఈనెల 27న రానున్న ఆలోచన

పి.ఎస్.జె. ఫిలిమ్స్ అండ్ కో బ్యానర్ పై ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో సురేందర్ చాచా తెరకెక్కించిన చిత్రం ‘ఆలోచన’. ఈ నెల 27న ధియేటర్ ల ముందుకు రానుంది. దీపావళి సందర్భంగా ‘ఆలోచన’ మూవీ రిలీజ్ డేట్ పోస్టర్‌ను వినూత్నంగా వృద్దాశ్రమంలో వందలాదిమంది సీనియర్ సిటిజన్స్ సమక్షంలో లాంచ్ చేశారు.

అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో.. నిర్మాత ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ .. ‘దర్శకుడు చాచాతో ఎప్పుడూ ఏదో ఒక కథ గురించి చర్చిస్తూ ఉండేవాళ్లం. అలాంటి టైంలోనే ‘ఆలోచన’ కథను చెప్పాడు. ఆ టైంకి మాకు శ్రీనివాస్ గారు కూడా అండగా నిలిచి చేద్దాము అని అన్నారు. అప్పుడే ఈ ప్రాజెక్ట్ మొదలయిందన్నారు. మరో నిర్మాత గుండబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ .. ఓల్డ్ ఏజ్ పీపుల్స్ చుట్టూ జరిగే ఈ కథ ఎంతో హార్ట్ టచింగ్‌గా ఉంటుంది. ‘ఆలోచన’లోని కాన్సెప్ట్, పాయింట్ అందరిలోనూ ఆలోచన రేకెత్తించేలా ఉంటుందన్నారు. దర్శకుడు సురేందర్ చాచా మాట్లాడుతూ .. ఈ కథను ముందుగా నారాయణ రావు గారికే వినిపించాను. ఆ టైంలో ఆయన కనీసం లేవలేని స్థితిలో ఉన్నారు. స్క్రిప్ట్ ఇక్కడే పెట్టు.. రెండ్రోజుల తర్వాత ఫోన్ చేస్తా అని ఆయన అన్నారు. కథ అద్భుతంగా ఉందని పొగిడారు. ఆయనే ఒక్కో ఆర్టిస్టుకి ఫోన్ చేసి మరీ చెప్పారు. ఈ విషయం లో ప్రదీప్, శ్రీనివాస్ నాకు ఎంతో సహకరించారు. నవంబర్ 27న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. G.V నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, మహర్షి రాఘవ, జయలలిత, రజన్ హరి, బెన్నీ సుధాకర్ తదితరులు ముఖ్యపాత్రలు కాగా
కెమెరామెన్ : టి. సురేంద్ర రెడ్డి
సంగీత దర్శకుడు : వియాన్
ఎడిటర్ : ఆర్.ఎల్. వర్మ
ఆర్ట్ డైరెక్టర్ : గిరీష్ దేవాంగ్
రిలీజ్ : ఎస్. కె. పిక్చర్స్.
పి ఆర్ ఓ : శ్రీధర్ శ్రీ, ప్రసాద్ – ధీరజ్. ఇతర సాంకేతిక వర్గం
ఈ కార్యక్రమంలో సీనియర్ నటి జయలలిత, సుజనా,
అనుపమ స్వాతి, హసిత, సురేష్ కొండేటి పాల్గొన్నారు.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More