తెలుగు సినీ పరిశ్రమలో అధికశాతం మహాకూటమి అనుకూలురు ఉన్నప్పటికీ ఎన్నికలు జరుగుతున్న ఈ సమయంలో వారు ఎందుకు బయటకు రాలేకపోతున్నారో ఒక్కసారి ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత వున్నదని నిర్మాత నట్టికుమార్ అంటున్నారు.. ఒకవేళ బయటపడితే జగన్ రెడ్డి ఏం చేస్తారోనన్న భయంతో వాళ్లంతా ఉన్నట్లుంది రాజధాని లేక,, యువతకు ఉద్యోగాలు రాక అంధకారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడటం కోసం సినీ పరిశ్రమలోని మహాకూటమి అనుకూలురు అంతా స్వచ్ఛందంగా ముందుకువచ్చి, కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.. హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు సినీ పరిశ్రమ ను జగన్ రెడ్డి బయపెడుతుండటం వల్లే వీళ్లంతా తెర వెనుక ఉన్నారని ఎక్కడినుంచో ఎన్నారై లు వచ్చి తమ సొంత ఊర్లలో చంద్రబాబుకు సపోర్ట్ చేస్తున్నారు. పోసాని కృష్ణమురళిని సినిమా వారిని తిట్టడానికే ఎఫ్.డి.సి. చైర్మన్ పదవి ఇచ్చినట్లు ఉంది. బెదిరింపు ధోరణి లో పోసాని మాట్లాడుతున్నారు. జగన్ ని చంద్రబాబు చంపేస్తానని అన్నారంటూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు..పోసాని కి దమ్ము ఉంటే వివేకా హత్య కేసు, అలాగే, కోడికత్తి, గులకరాయి డ్రామా గురించి చెప్పాలి.. జగన్ చెళ్ళిళ్లకే సెక్యూరిటీ లేదు.. ఇక మహిళలకు రక్షణ ఏముంటుంది? బటన్ నొక్కుతానని జగన్ టాక్స్ లు పెంచారు. అలాగే కరెంటు బిల్లులలో ఈడీ, సర్ చార్జీలు అదనంగా వేసి, ప్రజలపై భారం మోపుతున్నారు. లోకేష్ ని ఓడించాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నప్పటికి లోకేష్ 70వేల బంపర్ మెజారిటీ తో గెలుస్తారు. పవన్ లక్షకు పైగా మెజారిటీతో గెలవబోతున్నారు..ముద్రగడ పద్మనాభం విసిరిన ఛాలెంజ్ విషయంలో ఓడిపోతున్నందున ముహూర్తం చూసుకుని రెడ్డి పేరు పెట్టుకునేందుకు రెడీగా ఉండాలి ముద్రగడను ఆయన కూతురే విమర్శిస్తోంది. జగన్ ఏమి హామీ ముద్రగడ కు ఇచ్చారు. కాపు లకు కాపులే శత్రువు అనేలా ముద్రగడ వ్యవహారశైలి ఉంది. జగన్ ప్రతిపక్షం లో కూర్చోని సమాధానాలు చెప్పటానికి సిద్దంగా ఉండాలి. ఏపీలో మహాకూటమి 130 నుంచి 135 సీట్ల వరకు గెలుచుకుని అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు
previous post
next post