Vaisaakhi – Pakka Infotainment

డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ప్రియదర్శి, నభా నటేష్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘డార్లింగ్’ ఎప్పటినుంచంటే….

ప్రియదర్శి, నభా నటేష్ హీరో హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ “డార్లింగ్” ఇటీవలే థియేటర్స్ లో సందడి చేసింది. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ కు వినోదాన్ని అందించిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అయ్యింది. ఈ నెల 13వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో “డార్లింగ్” స్ట్రీమింగ్ కు రాబోతోంది. ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య “డార్లింగ్” సినిమాను నిర్మించారు. అశ్విన్ రామ్ దర్శకత్వం వహించారు. బ్రహ్మానందం, విష్ణు, కృష్ణతేజ్, అనన్య నాగళ్ల ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. స్ప్లిట్ పర్సనాలిటీ ఉన్న భార్యతో భర్త పడే ఇబ్బందులను హిలేరియస్ గా చూపిస్తూ ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేసిందీ సినిమా. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో “డార్లింగ్” మూవీ ప్రేక్షకులకు మరింతగా రీచ్ కానుంది.

వైరల్ అవుతున్న నభా నటేష్ డైలాగ్స్

గ్లామర్ తో పాటు పర్ ఫార్మెన్స్ తో మెప్పించగల హీరోయిన్ నభా నటేష్. ఆమె తన మొదటి సినిమా నుంచే అన్ని వర్గాల ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. ఇండస్ట్రీలోనూ నభా అట్రాక్టివ్ లుక్స్ తో పాటు మంచి పర్ ఫార్మర్ అనే పేరు తెచ్చుకుంది. లేటేస్ట్ మూవీ “డార్లింగ్” లోనూ నభా నటేష్ నటన హైలైట్ అయ్యింది. ఈ సినిమాలో ఆమె స్ప్లిట్ పర్సనాలటీ ఉన్న ఆనంది క్యారెక్టర్ లో తన పర్ ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకుంది. “డార్లింగ్” సినిమాలో నభా నటేష్ చెప్పిన డైలాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎంతోమంది ఇన్ఫ్లుయెన్సర్స్ నభా డైలాగ్ తో రీల్స్ చేస్తున్నారు.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More