Vaisaakhi – Pakka Infotainment

మన పురాతన దేవతా విగ్రహాలను ఏలియన్సే ప్రతిష్టించారా ?

భారత్ లోని అనేక పురాతన దేవాలయాలలో ప్రతిష్టించిన దేవత విగ్రహాలు ఓ కొత్త మిస్టరీ కి ఊతమిస్తున్నాయి ఆ రహస్యాన్ని ఛేదించేందుకు ఎంతోమంది సైంటిస్టులు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఆ పరిశోధనలో ఒక్కొక్కరు ఒక్కొ విధంగా స్పందిస్తున్నారు. అదే విధంగా హిందూ దేవతల విగ్రహాలకు సంబంధించి తవ్వకాలలో బయటపడుతున్న పురాతన విగ్రహాలుగాని వేల ఏళ్లక్రితం ఆలయాలలో ప్రతిష్టించిన విగ్రహాలు ప్రస్తుతం భూమి మీద ఉన్న ఏ శిలతోను మ్యాచ్ కాకపోవడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ శిలలలో ఉండే కొన్ని ఖనిజాల కారణంగా తన రూపురేఖలు పూర్తిగా మార్చుకుని ఒక కొత్త ఖనిజంగా రూపాంతరం చెందడంతోనే ప్రస్తుతం తలెత్తుతున్న సందేహాలకు కారణమవుతుందని అంటున్నారు. అయితే మరి కొందరు పరిశోధకులు ఈ మేధావుల వాదనలను తప్పు పడుతున్నారు. పూర్తిస్థాయిలో ఈ అంశంపై పరిశోధన చేయకుండా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తమ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండటం వల్ల కన్ఫ్యూజన్ ఏర్పడుతుందని విశ్లేషిస్తున్నారు. . ఎవరిన్ని విధాలుగా తమ అభిప్రాయాలను వెలిబుచ్చినప్పటికీ హిందూ పురాతన దేవాలయాలలో ప్రతిష్టించిన విగ్రహాలు భూమి మీద ఉండే ఏ శిలాజంతో కూడా సరిపోలకపోవడంమే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఆ విగ్రహాలను తయారు చేసేందుకు భూమి మీద ఉండే శిలలను ఉపయోగించ లేదా మరి ఎక్కడి నుంచి ఆ శిలలను తీసుకొచ్చి విగ్రహాలు తయారు చేశారు.. వేరే గ్రహాల నుంచి గ్రహాంతర వాసులు తీసుకొచ్చిన శిలలతో దేవత విగ్రహాలు తయారు చేశారా అన్నది కూడా ఒక సందేహం తలెత్తుతుంది. అయితే ఈ విషయాన్ని చాలామంది కొట్టిపారేస్తున్నారు. గ్రహాంతర వాసులు భూమి మీదకు రావడమేంటి వారు విగ్రహాలను తయారు చేయడమేంటని ఇదంతా చాలా సిల్లీగా ఉందని చెబుతున్నారు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టం ప్రపంచంలో ఏ మూలఅయిన సరే భూమి నుంచి కానీ సముద్ర గర్భం నుంచి గాని బయటపడిన పురాతన శిలలలో హిందూ దేవత విగ్రహాలు ఉండటం సర్వసాధారణంగా మారింది. అది ముస్లిందేశం కావచ్చు లేదా క్రిస్టియన్ దేశం కావచ్చు లేదా మరే మతాన్ని అనుసరించిన దేశమైన కావచ్చు. ఆ విగ్రహాలు కూడా భారతీయ ఇతిహాసాలలో పేర్కొంటున్నట్టుగా చెక్కి ఉండటం విశేషం. ఇలా బయటపడుతున్న కొన్ని పురాతన విగ్రహాలు ఈ భూమి మీద ఉండే ఏ శిలతోను కూడా మ్యాచ్ కాకపోవడమే విశేషం. వీటి కోసం మరింతగా లోతుగా పరిశోధన చేస్తే చాలా విషయాలు బయట పడే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మరో వాదన తెరపైకి వచ్చింది. భూమికంటే ఎంతో పురాతనమైన ఉల్కలు ఆయా గ్రహాల చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. భూమి మీద జీవము ఏర్పడక ముందు ఏర్పడిన తర్వాత కూడా ఆయా ప్రాంతాల్లో ఈ ఉల్కలు పడుతూనే ఉన్నాయి. ఇందులో భారీగా ఉన్న ఉల్కల వలన చాలా ప్రమాదాలు జరిగాయి. “సుమత్రాలో దొరికిన ఉల్క ఒక కార్బనేషియస్ కాండ్రైడ్. గ్రహాలు ఏర్పడడానికి ముందు సంభవించిన ఘటనలను తెలుసుకోడానికి ప్రారంభ సౌర వ్యవస్థ అవశేషాలు ఒక అవగాహనను అందిస్తాయ”ని ఎర్త్ అబ్జర్వేటరీ సింగపూర్‌కు చెందిన జాసన్ స్కాట్ హెర్రిన్ ప్రపంచానికి తెలియజేశారు. వాటిలో సేంద్రీయ సమ్మేళనాలు ఉండడం, మన గ్రహం ప్రారంభం నుంచీ అవి మన భూమిపైకి దూసుకొస్తుండడం వల్ల “ఉల్కలు తమతోపాటూ బహుశా ప్రారంభ జీవితానికి సంబంధించిన ఆధారాలు కూడా తీసుకొస్తుండచ్చు” అని పేర్కొన్నారు. కొన్నివేల సంవత్సరాల క్రితం ఇలాగే భూమి మీద పడిన ఉల్కలు ఒక బలమైన శిలలు గా మారాయని. అలాంటి ఉల్కశిలలతోనే దేవత విగ్రహాలను తయారుచేసి ఆయా ఆలయాలలో ప్రతిష్టించారనే ప్రచారం కూడా ఉంది. అందుకే ఈ పురాతన విగ్రహాలు భూమిపై ఉన్న ఏ శిలతో కూడా సరిపోలకపోవడం లేదని సైంటిస్టులు చెబుతున్నారు. కొందరు చరిత్రకారుల కథనం ప్రకారం అట్లాంటిస్ మహానగరం ఉన్న సమయంలోనే రామాయణ గాధ జరిగిందనే ప్రచారం కూడా ఉంది. ఆ సమయంలో అట్లాంటిస్ వాసులు కూడా రామాయణ కాలం నాటి పుష్పక విమానాలు మాదిరి వాహనాలతో అంతరిక్ష ప్రయాణాలు చేసే వారినే ఒక ప్రచారం ఉంది. ఆ సమయంలో ఇతర గ్రహాలకు కూడా వెళ్లి వస్తుండే వారిని కొందరు మేధావులు కొన్ని పుస్తకాలలో తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఇప్పటికంటే అప్పటి టెక్నాలజీ చాలా అడ్వాన్సుడ్ గా ఉండేదని అంటున్నారు. ఆ సమయంలోనే ఇతర గ్రహాల నుంచి తీసుకొచ్చిన కొన్ని శిలలతో ఇక్కడ తమకు నచ్చిన వారి విగ్రహాలను చెక్కి ఉంటారనే అపోహలు కూడా ఉన్నాయి. ఆ కారణంగానే పురాతన విగ్రహాలు భూమి మీద ఉండే శిలాలతో మ్యాచ్ కావడం లేదని అంటున్నారు. అయితే అట్లాంటిస్ మహానగరం సముద్రంలో మునిగిపోవడంతో ఆ నగర చరిత్ర ప్రపంచ పటం నుంచి మాయమైపోయింది. ఇక్కడ మరో విషయం ఏంటంటే శ్రీరాముని వారసులకు అట్లాంటిస్ వాసులకు జరిగిన యుద్ధంలో భయంకరమైన అణ్వాయిదాలు వాడి ఉంటారని వాటి కారణంగానే ప్రపంచం చాలావరకు నాశనం అయిందని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. భూమి అడుగు బాగాన దొరికే శిలాజాల్లో పెద్ద మొత్తంలో రేడియేషన్ కనిపిస్తూ ఉండటం ఇటువంటి భారీ యుద్ధాలు జరిగినప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఇప్పుడు ఈ కథనంలో చర్చించుకున్న అంశాలు నమ్మలేని విధంగా ఉండొచ్చు, చర్యకు ప్రతి చర్య ఉన్నట్లే గతానికి భవిష్యత్తుకు ఒక లింక్ అనేది ఉంటుంది. దేనిని కూడా అంతా ఈజీగా తీసిపారేయకూడదు. చాలా మంది పాశ్ఛత్య మేధావులు కొన్ని శతాబ్దాల క్రితం భారత్ లో పర్యటించి ఇక్కడి గొప్పతనాన్ని తమ గ్రంథాల్లో రాసుకున్నారు. భారతదేశం నిజంగా పుణ్యభూమి అని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మికతను ప్రసరింపజేసిన గొప్ప చరిత్ర గల దేశం అని భారతదేశ గొప్పతనం కోసం తమ గ్రంధాల్లో గొప్పగా రాశారు. అయితే ఇప్పుడు బయటపడుతున్న చరిత్ర విషయంలో భిన్నాభిప్రాయాలు భిన్న ఆధారాలు.. కన్ఫ్యూజన్ లో నెట్టేసే విధం గానే ఉండడం విచారకరం ఏది ఏమైనా అంశం ఏదైనా లోతుగా పరిశోధన జరగడం అత్యవసరం.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More