ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న . ‘విశ్వంభర’ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు విశ్వంభర సిద్ధం అవుతోంది. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ లో వేసిన మ్యాసీవ్ సెట్ లో జరుగుతోంది. ఈ రోజు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వివి వినాయక్ ‘విశ్వంభర’ సెట్స్ లోకి వచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవిగారితో ఆయనకున్న ప్రత్యేక అనుబంధాన్ని పంచుకుంటూ కాసేపు మాట్లాడుకున్నారు. చిత్ర యూనిట్ కి, డైరెక్టర్ వశిష్ట కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట, వి వి వినాయక్ కలసివున్న ఫోటోని మేకర్స్ షేర్ చేశారు.
next post