Vaisaakhi – Pakka Infotainment

మైత్రీ మూవీస్ విడుదల చేస్తున్న విరాజి

మహా మూవీస్ మరియు ఎమ్ 3 మీడియా పతాకంపై వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించిన చిత్రం “విరాజి”. ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల కానుంది. మరింత మంది ప్రేక్షకులను ఆకర్షించేందుకు అందుబాటు టికెట్ రేట్లతో “విరాజి” థియేటర్స్ లో ప్రదర్శితం కానుంది. సింగిల్ స్క్రీన్స్ లో 99 రూపాయలు, మల్టీప్లెక్సుల్లో 125గా టికెట్ రేట్లు పెడుతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. మైత్రి మూవీ మేకర్స్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా ను విడుదల చేస్తున్నారు తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ – దర్శకుడు ఆద్యంత్ హర్ష “విరాజి” కథను చెబుతుంటే గూస్ బంప్స్ వచ్చాయి. డైరెక్టర్ ఆద్యంత్ హర్షకు థ్యాంక్స్ చెబుతున్నా. అంత బాగా నెరేట్ చేశాడు. నా క్యారెక్టర్ మేకోవర్ దగ్గర నుంచి ప్రతీది కొత్తగా తెరకెక్కించాడు. ఇలాంటి సబ్జెక్ట్ ను ఒక ప్యాషన్ తో ప్రొడ్యూస్ చేశారు నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల ఫ్లాప్స్ లో వున్న టైమ్ లో నిర్మాత మహేంద్ర గారు, కథను, నన్నూ నమ్మి “విరాజి” చేశారు. నేను ఆండీ లుక్ లోనే ఏపీలో ప్రమోషనల్ టూర్ కు వెళ్లాను. ఎందుకంటే నాకు “విరాజి”తో మీరంతా మరో అవకాశం ఇస్తారనే నమ్మకంతో ప్రమోషన్ చేస్తున్నాను. నేనెందుకు ఇంత ఎగ్జైటింగ్ గా ఉన్నాను అనేది ఆగస్టు 2న థియేటర్స్ లో మూవీ చూసినప్పుడు అర్థం చేసుకుంటారు. మీరంతా థియేటర్స్ కు వచ్చి “విరాజి” చూస్తారని ఆశిస్తున్నా. అన్నారు
నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ – “విరాజి” మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ జూలై 2న చేశాం. ఆగస్టు 2న రిలీజ్ అని ఆరోజే చెప్పాం. సరిగ్గా నెల రోజులు ప్రమోషన్స్ కు పెట్టుకున్నాం. ఒక మంచి మూవీ చేశామనే నమ్మకం మా టీమ్ అందరిలో ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం వెళ్లాం. అక్కడ కాలేజీలకు వెళ్లి పబ్లిసిటీ చేశాం. స్టూడెంట్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. హీరో అంటే నటించి వెళ్లడమే కాదు నిర్మాతగా నా పక్కన వరుణ్ ఉంటున్నారు. ఆయన లేకుంటే ఈ ప్రమోషన్స్ ఇంత బాగా చేసే వాళ్లం కాదు. “విరాజి”తో ఒక మంచి మూవీ రూపొందించారు మా సినిమా కోసం టికెట్ రేట్లు తగ్గిస్తున్నాం. ప్రేక్షకులకు అందుబాటు ధరల్లో సింగిల్ స్క్రీన్స్ కు 99 రూపాయలు, మల్టీప్లెక్సులకు 125 రూపాయలుగా టికెట్ రేట్లు ఉంటాయి. మా మూవీకి వీలైనంత ఎక్కువ మంది ప్రేక్షకుల్ని రప్పించేందుకు టికెట్ రేట్లు తగ్గించాం. మీరు సపోర్ట్ చేస్తే నాకు మరో నాలుగు మూవీస్ చేసే శక్తి వస్తుంది. పదిమందికి ఉపాధి దొరుకుతుంది. “విరాజి” మూవీని థియేటర్స్ లో చూస్తారని కోరుకుంటున్నా. అన్నారు. దర్శకుడు ఆద్యంత్ హర్ష నటులు కాకినాడ నాని ,మణిరూప్, నటి కుషాలినీ తదితరులు ప్రసంగించారు.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More