విజయ్ దేవరకొండ మరోసారి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నటిస్తున్నారు. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా విజయ్ తన కొత్త సినిమాను ఎనౌన్స్ చేశారు.. ‘రాజా వారు రాణి గారు’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్వీసీ సంస్థలో వస్తున్న 59వ చిత్రమిది. భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందనున్న ఈ సినిమా కు రౌడీ జనార్దన్ అనే టైటిల్ ను పరిశీస్తున్నారు..
విజయ్ దేవరకొండకు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమాను ప్రకటించారు. అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో కత్తి పట్టుకుని, వయలెంట్ మోడ్ లో ఉన్న చేతిని చూపిస్తూ ‘కత్తి నేనే, నెత్తురు నాదే, యుద్ధం నాతోనే..’ అనే క్యాప్షన్ తో పక్కా ఏక్షన్ చిత్రమని స్పష్టం చేశారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కనున్న. ఈ మూవీకి సంబంధించి త్వరలో కాస్ట్ అండ్ క్రూ వివరాలు బయటకురానున్నాయి..
previous post