Vaisaakhi – Pakka Infotainment

‘వెతికా నేనే నా జాడే’ అంటున్నవిజయ్ ఆంటోనీ

గతంలో విజయ్ ఆంటోనీ హీరోగా రాఘవన్, హత్య సినిమాలను నిర్మించినఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా లు విజయ్ మిల్టన్ దర్శకత్వం లోనిర్మిస్తున్న పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకున్న “తుఫాన్” గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రానున్న నేపథ్యంలో “తుఫాన్” నుంచి సెకండ్ సింగిల్ ‘వెతికా నేనే నా జాడే’ రిలీజ్ చేశారు.
‘వెతికా నేనే నా జాడే’ పాటకు భాష్యశ్రీ లిరిక్స్ అందించారు. మాష్మి నేహా పాడారు. హరి దఫూషియా సంగీతాన్ని అందించారు. ‘ వెతికా నేనే నా జాడే నిలిచి దారిలో..నా ఒళ్లే వెతికే నేడు కొత్త పేరునే, నాకు నేనై తప్పి పోయా గాలై సాగుతూ..కాలం కరిగిపోయే తీరం చేరుతూ’ అంటూ ఆలోచింపజేసే లిరిక్స్ తో సాగుతుందీ పాట. “తుఫాన్” సినిమాకు ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More