మహా మూవీస్ , ఎమ్ 3 మీడియా బ్యానర్ల పై వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించిన చిత్రం “విరాజి”. ఈ చిత్రం ఫస్ట్ లుక్ మరియు టీజర్ ను బేబీ చిత్ర దర్శకుడు సాయి రాజేష్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా సాయి రాజేష్ మాట్లాడుతూ విరాజి టీజర్ చాలా బాగుంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. వరుణ్ సందేశ్ లుక్ అదిరిపోయింది. క్యారెక్టర్ కోసం అంత అంకిత భావంతో పని చేస్తున్న వరుణ్ సందేశ్ కి కంగ్రాట్స్. ప్రమోషన్ లో కూడా తన క్యారెక్టర్ గెట్ అప్ లో పర్మనెంట్ హెయిర్ కలర్ లో ఉండటం చాలా అరుదు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలి. అలాగే దర్శకుడు ఆద్యంత్ హర్ష మా నెల్లూరు వాడు కావడం చాలా సంతోషం. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఈ చిత్రాన్ని విడుదల చేయడం చాలా సంతోషం. ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల అవుతుంది, నిర్మాత మహేంద్ర గారికి ఈ చిత్రం మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు..
దర్శకుడు ఆద్యంత్ హర్ష మాట్లాడుతూ “విరాజి నా మొదటి సినిమా వరుణ్ సందేశ్ గారి లుక్ కి కథ కి చాలా దగ్గరి సంబంధం ఉంది. ఆగస్టు 2న సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది” అని తెలిపారు హీరొ వరుణ్ సందేశ్ ,
నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల తదితరులు మాట్లాడారు.