టాలీవుడ్ కి సంక్రాంతి, సమ్మర్ వెరీ వెరీ స్పెషల్ ఈ రెండు సందర్భాల్లో బాక్సాఫీసు కళ అంతా కాదు మిగిలిన పండగల సంగతి ఎలా ఉన్నా సంక్రాంతి సినిమాల కోసం.. సమ్మర్ రిలీజుల కోసం ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు.. సూర్యుడు ఎంత భగభగలాడించినా.. ఉక్కపొత ఏ రేంజ్ లో ఉన్న సమ్మర్ సినిమాలు కోసం తెలుగు ప్రేక్షకులు వెయిట్ చేస్తూనే ఉంటారు. అయితే ఈ ఏడాది మాత్రం వారి నిరీక్షణ పై టాలీవుడ్ నీళ్లు చల్లి ఉసూరు అనిపించింది సినిమా ధియేటర్ లు కళకళలాడాలంటే పెద్ద సినిమాలు రాక అనివార్యం. అయితే ఈసారి పెద్ద సినిమాలు మొహం చాటేయడంతో సమ్మర్ సైలెంట్ గా వెళ్ళిపోనుంది. గత ఏడాది ఏప్రిల్ జూన్ మధ్యకాలంలో ఎన్నో చిన్న సినిమాలు తో పాటు రావణాసుర, శాకుంతలం, విరూపాక్ష, ఏజెంట్, రామబాణం, ఉగ్రం, కస్టడీ, ఆదిపురుష్, విమానం, అహింస, సామజవరగమన, వంటి చిత్రాలుతోపాటు చాలా సినిమాలు థియేటర్ల వద్ద సందడి చేశాయి. శాకుంతలం, ఏజెంట్, ఆదిపురుష్, రామబాణం, రావణాసురా, వంటి పెద్ద సినిమాలు బొక్కబోర్లా పడి ఫ్లాప్ బాట పట్టగా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ విరూపాక్ష, సామజవరగమన, చిత్రాలు ఊహించిని విజయాన్ని సమ్మర్ కు అందించాయి.. ఈ ఏడాది మాత్రం ఇప్పటివరకు బిగ్ మూవీస్ విడుదల కాకపోవడం ఆ చిత్రాలు ఇప్పుడు రావు అన్న ప్రకటనతో ప్రేక్షకులు డీలా పడిపోయారు.
ఈ సమ్మర్ లో గొప్పగా చెప్పుకోదగ్గ సినిమా ఏదైనా ఉందంటే అది ఒకే ఒక్క ది ఫ్యామిలీ స్టార్(THE FAMILY STAR).. విజయ్ దేవరకొండ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ స్టాంపు వేయించుకుంది ఎప్పటినుంచో సమ్మర్ కి వస్తాయని ఊహించిన గేమ్ ఛేంజర్(GAME CHANGER), దేవర(DEVARA), కల్కి2898(KALKI2898), ఇండియన్ 2(INDIAN 2) వంటి పెద్ద చిత్రాలు రిలీజ్ వాయిదా పడుతూ వస్తూనే ఉన్నాయి. జూన్ రిలీజ్ కి వస్తామన్న ఇండియన్ 2 మళ్ళీ వాయిదా పడింది కల్కి2898 జూన్ రిలీజ్ డేట్ ప్రకటించిన ఇంకా రిలీజ్ పై ట్రేడ్ వర్గాల్లో అనుమానమే ఉంది. రెండు ఎపిసోడ్స్ పర్ఫెక్షన్ కోసం రీ షూట్ కి వెళ్తున్నట్లు సమాచారం. ఇక గేమ్ చేంజర్ సమ్మర్ ని పలకరించే పరిస్థితి అయితే ఏమాత్రం లేదు. దేవర అయితే గౌరవంగా ఆగస్టు వెళ్లిపోయింది. పుష్ప టు(PUSHPA 2) కూడా ముందే ఆగస్టు వస్తున్నామని మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. కాబట్టి నో డిస్కషన్ చాలా కాలం నుంచి ఊరిస్తున్న పూరి జగన్నాథ్ ఉస్తాద్ రామ్ ల డబల్ ఇస్మార్ట్ జూన్ లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.. ఇవి కాక కొన్ని చిన్న సినిమాలు మే, జూన్ నెలల్ని ఆక్యుపై చేశాయి వాసిపరంగా సంఖ్య కనిపిస్తున్నప్పటికీ సినిమాల్లో హిట్ కంటెంట్ లేకపోవడంతో అవి ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు వెళ్తున్నాయో తెలియని పరిస్థితి. ఏది ఏమైనా చిన్న పెద్ద అన్న భారీకేడ్ లు చేరిపేసుకున్న తెలుగు సినిమా ప్రేక్షకులు మంచి కంటెంట్ వస్తే దాన్ని విపరీతంగా మోసేస్తున్నారు. మేకర్స్ కూడా గుడ్ కంటెంట్ వైపు అడుగులు వేస్తే సమంజసంగా.. తెలుగు సినిమాకు సగౌరవంగా కూడా ఉంటుంది.. ఎలా అయితేనే ఈ సమ్మర్ తెలుగు సినిమా దాదాపు మిస్ చేసుకున్నట్లే కనిపిస్తుంది..