Vaisaakhi – Pakka Infotainment

‘సత్యం సుందరం’పై ఆడియన్స్ చూపిస్తున్న లవ్ వెరీ న్యూ ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది. సక్సెస్ మీట్ లో హీరో కార్తి

ఇది సక్సెస్ మీట్ లా లేదు ఫ్యామిలీ ఫంక్షన్ లా వుంది. మీరంతా ఎంతో ప్రేమతో అప్రిషియేట్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. మంచి సినిమాలు చేసినప్పుడు అప్రిషియేట్ చేస్తారు. కానీ ‘సత్యం సుందరం’కు ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ కొత్త అనుభూతిని ఇచ్చింది. ఇంత ప్రేమని ఇస్తున్న అందరికీ థాంక్ యూ. మీరు చూపించిన లవ్ కి చాలా ఎమోషనల్ అయ్యానని హీరో కార్తీ అన్నారు. 96 ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో, 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక ఈ చిత్రాన్ని నిర్మించిన సత్యం సుందరం సినిమా ప్రేక్షకులు, విమర్శకుల ప్రసంశలు అందుకోని యునానిమాస్ బ్లాక్ బస్టర్ విజయంతో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోన్న సందర్భంగా టీం సక్సెస్ మీట్ ని నిర్వహించింది.
సక్సెస్ మీట్ లో హీరో కార్తీ మాట్లాడుతూ.. ముందుగా కే విశ్వనాథ్, బాలచందర్, కమల్ హాసన్, దాసరి గారు లాంటి గొప్పవారికి థాంక్స్ చెప్పాలి. ఇలాంటి సినిమా మనికి చిన్నప్పుడే చూపించారు. ఈ కైండ్ అఫ్ సినిమాని మనలోపల పెట్టారు. అందుకే సినిమాని యాక్సప్ట్ చేయడం జరిగింది. కొత్త సినిమాలు చేస్తే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకాని ఈ సినిమా మరోసారి రుజువుచేసింది. అన్ కండీషనల్ లవ్ ని ప్రేక్షకులు చూస్తారని ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ అయ్యింది. ఈ సినిమా విజయం ఇలాంటి మరిన్ని సినిమాలు చేయాలనే నమ్మకాన్ని ఇచ్చింది. ఇలాంటి ఎమోషన్స్ జీవితంలో మిస్ అవుతున్నాయని, మళ్ళీ ఆ ఎమోషన్ ని తీసుకొచ్చారని ఆడియన్స్ చెప్పినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ఇలాంటి స్క్రిప్ట్ రాయాలంటే లోపల అంత ప్రేమ వుండాలి. డైరెక్టర్ ప్రేమ్ కుమార్ గారికి థాంక్ యూ. 96లో ఎలా ప్రేమించాలో చెప్పారు. ఇందులో అన్ కండీషనల్ లవ్ అంటే చూపించారు. అన్నయ్య ఈ కథ విన్న వెంటనే నువ్వు చేయాలని చెప్పారు. ఇది అప్రిషియేషన్స్ తో స్టాప్ అవ్వకూడదు. కమర్షియల్ గా కూడా పెద్ద హిట్ అవ్వాలి. అప్పుడే మాత్రమే నిర్మాతలు ఇలాంటి సినిమాలు తీసుకొస్తారు. ఈ సినిమా నా కోసం కాదు మంచి సినిమా కోసం చూడాలని ప్రేక్షకులని కోరుకుంటున్నాను. చిన్న విషయాలని అప్రిషియేట్ చేయాలని ఒక జనరేషన్ కి ఈ సినిమా ద్వారా చూపించాం. శ్రీదివ్య చేసిన ప్రతి సీన్ కి క్లాప్స్ పడ్డాయి. చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఈ సినిమాని ప్రేమతో చేశారు. ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులు థాంక్ యూ’ అన్నారు.
డైరెక్టర్ సి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ సినిమా, కార్తిపై మీరు చూపిస్తున్న ప్రేమకు థాంక్ యూ. ఆర్య, జడగం సినిమాలతో తెలుగులోనే కెరీర్ మొదలుపెట్టాను. తెలుగు నా సెకండ్ హోమ్. అందరికీ థాంక్ యూ’ అన్నారు. హీరోయిన్ శ్రీ దివ్య మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సినిమాకి మీడియా ఇన్ని మంచి ప్రసంశలు రావడం చాలా బావుంది. సినిమాని ఇంత సక్సెస్ చేసిన ఆడియన్స్ కి థాంక్ యూ. ఆడియన్స్ చూసి సక్సెస్ చేస్తేనే ఇలాంటి బ్యూటీఫుల్ ఫిలిమ్స్ ఇంకా వస్తాయి. కార్తి గారితో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. మా డైరెక్టర్ గా ఐ ఫీస్ట్ లా సినిమా చేశారు. మా సినిమాకి వర్క్ చేసిన అందరికీ థాంక్ యూ. ఇంకా చూడని ఆడియన్స్ తప్పకుండా చూడండి. మంచి సినిమా సినిమా మిస్ అవ్వద్దు’ అన్నారు

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More