Vaisaakhi – Pakka Infotainment

గేమ్ ఛేంజర్ తో బాక్సాఫీస్ బద్దలైపోవాలి.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌లో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

గేమ్ చేంజర్ ట్రైలర్ చూస్తే సామాజిక సందేశం ఇచ్చేలా ఉందనిపిస్తోంది. ఇలాంటి చిత్రాలతో కొత్త సంవత్సరంలో బాక్సాఫీస్ బద్దలైపోవాలని ఆంద్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు

రాజమండ్రి లో జరిగిన ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన మాట్లాడుతూ.. మన సినిమా పరిశ్రమకు మూలాలైనా రఘుపతి వెంకయ్య నాయుడు, దాదా సాహెబ్ ఫాల్కే, రాజ్ కపూర్, సత్య జిత్ రేని మర్చిపోలేం, అలాగే తెలుగు ఖ్యాతిని ఎగరేసిన నాగిరెడ్డి గారిని, బీఎన్ రెడ్డి గారిని, రామబ్రహ్మం గారు, ఎన్టీ రామారావు గారిని, ఏఎన్నార్ గారిని తలుచుకుంటాం. పవన్ కళ్యాణ్ ఉన్నా.. రామ్ చరణ్ ఉన్నా.. దానికి కారణం చిరంజీవి గారు. మీరు కళ్యాణ్ బాబు అని అరిచినా, ఓజీ అని అరిచినా, డిప్యూటీ సీఎం అని అరిచినా దానికి చిరంజీవి గారే ఆద్యులు. సీఎం చంద్రబాబు గారి సహకారం, మద్దతు వల్లే ఈ రోజు ఇక్కడ ఇలాంటి ఈవెంట్‌ను నిర్వహించుకోగల్గుతున్నాం. శంకర్ గారు చేసిన జెంటిల్మెన్ సినిమాను చెన్నైలో చూశాను. ప్రేమికుడు సినిమాకు అమ్మమ్మతో వెళ్లాను. సామాజిక సందేశాన్ని అందిస్తూ శంకర్ గారు సినిమాలు తీస్తుంటారు. ఈ రోజు రాజమౌళి గారు, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు గ్లోబల్ స్థాయికి వెళ్లారు. దానికి కొంత మంది సౌత్ దర్శకులు కారణం. అందులో శంకర్ గారు ఒకరు. తమిళంలో శంకర్ గారు సినిమాలు తీసి తెలుగు వారిని మెప్పించారు. ఆయన తెలుగులో సినిమా చేస్తే బాగుంటుందని ఎప్పటి నుంచో అనుకున్నాను. ఇక దిల్ రాజు గారు నా తొలిప్రేమ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశారు. నేను బాగా కష్టాల్లో ఉన్నప్పుడు వకీల్ సాబ్ సినిమా ఇచ్చారు దిల్ రాజు. ఆయన ఇచ్చిన డబ్బులే జనసేనకు ఇంధనంగా మారింది. మేం ఆంజనేయ స్వామి భక్తులం. అన్నయ్యకు అబ్బాయి పుట్టాడని మా నాన్న గారు ఎంతో ఆలోచించి రామ్ చరణ్ అని పేరు పెట్టారు. రాముని చరణాల వద్ద ఉండే వాడు.. ఆంజనేయుడు.. ఎంత బలం ఉన్నా వినయ విధేయంగా ఉంటాడు.. హనుమాది సిద్దులున్నా కూడా ఎంతో వినయంగా ఉండేవాడు.. అందుకే రామ్ చరణ్ అని మా నాన్న పేరు పెట్టారు. నాకు చిరంజీవి పితృసమానులు. నేను రామ్ చరణ్‌కు బాబాయ్‌లా ఉండను. రామ్ చరణ్ నాకు సోదర సమానుడు. రామ్ చరణ్ రంగస్థలం సినిమాకు అవార్డు వస్తుందని అనుకున్నాను. గోదారి తీర ప్రాంతాల్లో జీవించకపోయినా.. అద్భుతంగా నటించారు. తండ్రి మెగాస్టార్ అయితే కొడుకు గ్లోబల్ స్టార్ అవుతాడు. సంకల్ప బలం, పట్టుదల, కార్యదక్షత ఉంటే.. అందరూ మెగాస్టార్ చిరంజీవిలా ఎదగొచ్చు. ఆయన అంతలా ఎదగబట్టే నేను ఈ రోజు ఇలా ఈ స్థాయిలో ఉన్నాను. మా అన్నయ్య చిరంజీవి షూటింగ్‌లు చేసి ఇంటికి అలిసిపోయి వచ్చేవారు. ఆ టైంలో ఖాళీగా ఉండే నేను.. ఆయన షూస్, సాక్సులు తీసి కాళ్లు తుడిచేవాడిని. ఈ హీరో సినిమా పోవాలని మా జీవితంలో ఎప్పుడూ అనుకోలేదు. సర్వేజనా సుఖినోభవంతు అని మా తండ్రి గారు మాకు నేర్పించారు. అందరూ బాగుండాలని మేం కోరుకుంటాం. రామ్ చరణ్ హార్స్ రైడింగ్ చూస్తే నాకు అసూయగా అనిపిస్తుంది. నాకు హార్స్ రైడింగ్ రాదు. కానీ గబ్బర్ సింగ్ టైంలో హార్స్ రైడింగ్ పెట్టారు. నాకు హార్స్ రైడింగ్ రాదు అని గుర్రం దగ్గరకు వెళ్లి చెప్పా. దానికి క్యారెట్ పెట్టాను. అది నన్ను సురక్షితంగా తీసుకెళ్లింది. కానీ రామ్ చరణ్ మాత్రం హార్స్ రైడింగ్‌లో శిక్షణ తీసుకున్నాడు. ఈవెంట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరూ క్షేమంగా తిరిగి వెళ్లాలి. మీకు ఏమైనా అయితే నా గుండెకు గాయమైనట్టుగా ఉంటుంది. సినిమాను సినిమాలా చూడండి. టికెట్ రేట్లు డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. తెలుగు సినిమా స్థాయి పెరిగింది. ప్రతీ టికెట్ మీద జీఎస్టీ ఉంటుంది. ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. సినిమా రంగానికి రాజకీయ రంగు పులమడం నాక్కూడా ఇష్టం ఉండదు. అన్ని ఇండస్ట్రీల వ్యక్తులు కలిసి సినిమాల్ని చేస్తున్నారు. హాలీవుడ్‌ని అనుకరించడం కాకుండా మన మూలాల్ని పైకి తెచ్చేలా కథల్ని తీసుకురావాలి. స్వర్గీయ ఎన్టీరామారావు ఎప్పుడూ కూడా ఎవ్వరి మీద వివక్షను చూపించలేదు. చంద్రబాబు గారు సైతం ఎప్పుడూ తెలుగు చిత్ర సీమ అభివృద్దికి దోహద పడుతూనే ఉన్నారు. శంకర్ గారు తీసిన ఒకే ఒక్కడు, శివాజీ వంటివి చూస్తుంటే ఓ తృప్తి కలుగుతుంది. సినిమాలో మంచి చెడులూ ఉంటాయి. ఏది తీసుకోవాలనేది ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది. వినోదంతో పాటు ఆలోచింపజేసే చిత్రాలు కూడా రావాలని కోరుకుంటున్నాను. విలువల్ని నేర్పించే చిత్రాలు మరిన్ని రావాలని కోరుకుంటున్నాను. ఆంధ్ర ప్రదేశ్ తరుపున గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి, శంకర్ గారికి, దిల్ రాజు, శిరీష్ గార్లకు హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. ఎస్ జే సూర్య గారు చాలా మంచి దర్శకులు. ఆయనలో మంచి నటులు కూడా ఉన్నారు. నటుడు కావాలనే కోరిక ఉందని ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. నటుడిగా ఆయన అందరినీ ఆకట్టుకుంటున్నారు. గేమ్ చేంజర్ టీంకు ఆల్ ది బెస్ట్. మగధీరుడు, అల్లూరి సీతారామరాజుగా జీవించేశాడు.. రామ్ చరణ్ అందరి హీరోలకు చాలా మంచి ఫ్రెండ్.. ఏడాదికి కనీసం వంద రోజులు అయ్యప్ప మాల, ఆంజనేయ స్వామి మాల అని అంటాడు. అహంకారం రాకుండా ఉండాలని చేస్తుంటాని చెబుతుంటాడు. ఆస్కార్ వరకు వెళ్లినా ఒదిగే ఉంటాడు. ఉంటే సూట్‌లో కనిపిస్తాడు.. లేదంటే అయ్యప్ప మాలలో చెప్పులు లేకుండా కనిపిస్తాడు.. రామ్ చరణ్ మా బంగారం.. నా తమ్ముడులాంటి వాడు.. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండేవాడు.. అద్భుత విజయాలు కలగాలని బాబాయ్‌గానే కాకుండా అన్నగానూ ఆశీర్వదిస్తున్నాను’ అని అన్నారు.

రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘రాజమండ్రి బ్రిడ్జ్ మీద పవన్ కళ్యాణ్ గారు మొదటి సారి ర్యాలీ చేసినప్పుడు జన సంద్రం కనిపించింది. మళ్లీ ఇప్పుడు ఇక్కడ కూడా అలానే అనిపిస్తోంది. సినిమాలో నేను గేమ్ చేంజర్‌ని కావొచ్చు. కానీ ఈ రోజు ఇండియన్ పాలిటిక్స్‌లో పవన్ కళ్యాణ్ గారు రియల్ గేమ్ చేంజర్. పవన్ కళ్యాణ్ గారి లాంటి వారిని చూసే శంకర్ గారు ఇలాంటి పాత్రలని రాసి ఉంటారని అన్నారు.. దర్శకుడు శంకర్ మాట్లాడుతూ.. నేను నా కూతురి పెళ్లి శుభలేఖ ఇచ్చేందుకు ఆయన దగ్గరకు వెళ్లాను. ఆయన మిమ్మల్ని ఎంతో బాగా రిసీవ్ చేసుకున్నారు. ఎంతో చక్కగా మాట్లాడారు. ఆయనతో ఉన్న కొన్ని క్షణాల్లోనే ఎంతో నచ్చేశారు. నా ఇన్నేళ్ల కెరీర్‌లో ఒక్క తెలుగు సినిమా చేయలేదు. అయినా నన్ను ప్రేమిస్తూనే వచ్చారు. ఎలాగైనా ఓ తెలుగు సినిమా చేయాలని అనుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దిల్ రాజు గారు, రామ్ చరణ్ గారికి థాంక్స్. తెలుగు లొకేషన్లలోనే షూట్ చేశాం. మినిస్టర్, కలెక్టర్‌కు జరిగే వార్ నేపథ్యంలో సినిమా ఉంటుంది. హీరో ఫ్లాష్ బ్యాక్ అద్భుతంగా ఉంటుంది. రామ్ చరణ్ తన పాత్రల్లో జీవించేశారు. ఎంతో సహజంగా నటించారు. అంజలి గారు, కియారా గారు, శ్రీకాంత్ గారు, నవీన్ చంద్ర గారు, ఎస్ జే సూర్య గారు ఇలా అందరూ చక్కగా నటించారు. తమన్ మంచి సంగీతాన్ని ఇచ్చారు. నాకు సపోర్ట్ చేసిన నా టీం అందరికీ థాంక్స్’ అని అన్నారు. దిల్ రాజు మాట్లాడుతూ.. ఈ కథ తో మన రాష్ట్రంలో జరిగే ఎన్నో ఘటనలు గుర్తుకొచ్చాయి. రామ్ చరణ్ గారు మూడు డిఫరెంట్ పాత్రల్లో కనిపిస్తారు. రామ్ చరణ్ గారి నటన అద్భుతంగా ఉండబోతోంది. తమన్ మంచి సంగీతాన్ని ఇచ్చారు. సంక్రాంతికి రాబోతోన్న చిత్రాలకు టికెట్ రేట్ల పెంపు కోసం జీవో ఇచ్చిన ప్రభుత్వానికి థాంక్స్. జనవరి 10న మా చిత్రం రాబోతోంది. పెద్ద విజయం సాధించబోతోన్నామనే నమ్మకంతో ఉన్నామ’ ని అన్నారు.


సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేశ్ ,ఎస్ జే సూర్య . నటుడు
శ్రీకాంత్ ,సంగీత దర్శకుడు తమన్ , నటి అంజలి, ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి , ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు , ఎమ్మెల్యే బత్తుల బలరాం , ఎమ్మెల్సీ హరి ప్రసాద్ , ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ , కుడా చైర్మన్ తుమ్మల బాబు ముఖ్య అతిథులుగా
తదితరులు ప్రసంగించారు. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More