నిఖిల్ మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘స్వయంభూ’ మారేడుమిల్లిలోని బ్యూటీఫుల్ లోకేషన్స్ లో షెడ్యూల్ ప్రారంభమైయింది. మారేడుమిల్లిలోని దట్టమైన అడవులలో నిఖిల్ పై కొన్ని కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాలు నెరేటివ్ కి కీలకమని ఛాలెంజ్ తో కూడిన లాండ్ స్కేప్ మూవీ కి అథెంటిసిటీ, ఇంటన్సిటీ ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ‘స్వయంభూ’ నిఖిల్ 20వ మైల్ స్టోన్ మూవీగా గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని ప్రామిస్ చేస్తూ గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కుతున్న పీరియాడికల్ ఫిల్మ్. నిఖిల్ లెజెండరీ వారియర్ పాత్రను పోషిస్తున్నారు, ఈ పాత్ర కోసం నిఖిల్ ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు. పాత్ర పట్ల అతని అంకితభావం, డైనమిక్ పెర్ఫార్మెన్స్ ని తెరపైకి తీసుకొస్తోంది. ఈ మూవీ లో సంయుక్త, నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
next post