‘ప్రపంచంలో ఎయిర్ పొల్యూషన్ వల్ల 65 శాతం మంది చనిపోతున్నారు.. అంటే దమ్ము, మందు కంటే.. దుమ్ము వల చనిపోయేది పాతిక రెట్లు ఎక్కువ’.. ‘వస్తువులు మనతో మాత్రమే ఉంటాయి.. కానీ మొక్కలు మనతోనే ఉంటాయి..మనతో పాటు పెరుగుతాయి.. మన తరువాత కూడా ఉంటాయి’.. అంటూ అద్భుతమైన డైలాగ్స్‌తో సాగిన సింబా ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. అనసూయ, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సింబా’. సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద సంపత్ నంది, దాసరి రాజేందర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. సంపత్ నంది అందించిన ఈ కథకు మురళీ మనోహర్ దర్శకత్వం వహించారు. బుధవారం నాడు ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో.. అనసూయ మాట్లాడుతూ.. ‘వృక్షో రక్షతి రక్షితః అనే కాన్సెప్ట్ అందరికీ తెలిసిందే. పర్యావరణాన్ని మనం ఎలా పాడు చేస్తున్నామో.. దానికి ఎలాంటి పర్యవసనాలను చూస్తున్నామో అందరికీ తెలిసిందే. సింబా సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్‌తో రాబోతోంది. అందరికీ నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది. కబీర్, శ్రీనాథ్, వశిష్ట, దివి అద్భుతంగా నటించారు. జగపతి బాబు గారు ఈ చిత్రానికి ప్రధాన బలం. ఈ సినిమా ఒక్కరికి నచ్చినా కూడా ఒక్కరిలోనూ మార్పు తెచ్చినా ఎంతో మార్పు వస్తుంది. ఇంత మంచి చిత్రంలో నాకు ఛాన్స్ రావడం, ఇంత మంది టాలెంటెడ్ పర్సన్‌తో పని చేయడం ఆనందంగా ఉందన్నారు.. నిర్మాత దాసరి రాజేందర్ రెడ్డి నటి దివి , వశిష్ట ,కేతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి , మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణ సౌరభ్, కెమెరామెన్ కృష్ణ ప్రసాద్ తదితరులు మాట్లాడారు.