క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకున్న సుమంత్ సీతారామం సినిమాతో సాలిడ్ హిట్టు కొట్టాడు. ఆ మూవీలో మంచి క్యారెక్టర్ తో అందర్నీ ఆకట్టుకున్నాడు. ఆ మూవీ విజయంలో కూడా తాను కూడా భాగస్వామ్యం అయ్యాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా చేసిన సార్ మూవీలో కూడా ఒక మంచి క్యారెక్టర్ చేశాడు. ఈ మూవీ కూడా సూపర్ హిట్ కావడంతో సుమంత్ కు మంచి కంబ్యాక్ ఇచ్చినట్లయింది.వరుసగా రెండు సూపర్ హిట్ మూవీల్లో చాలా ప్రాధాన్యం ఉన్న పాత్రలను పోషించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. చాలా మూవీలలో ఆఫర్లు వస్తున్నప్పటికీ తన కెరీర్ కు హెల్ప్ అయ్యే క్యారెక్టర్లు మాత్రమే సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే సీతారామం, సార్ మూవీ లో ఉన్నాయి. సీతారామం మూవీలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హీరో కాగా, సార్ మూవీలో తమిళ నటుడు ధనుష్ హీరోగా చేశాడు. ఇందులో సీతారామం మూవీ పాన్ ఇండియన్ రేంజ్ లో రిలీజ్ అయి మంచి సక్సెస్ అయ్యింది. విడుదలైన అన్ని చోట్ల సక్సెస్ ఫుల్ గా రన్ అయింది. ఇక సార్ మూవీ తమిళ్, తెలుగులో తీశారు. ఈ రెండు లాంగ్వేజ్ లో కూడా ఈ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ రెండు చిత్రాల విజయం సుమంత్ కు బాగా హెల్ప్ అయ్యింది. పలు సినిమాలలో వరుసకు వస్తున్న ఆఫర్లను కాదని తనకు హెల్ప్ అయ్యే మూవీలను అలాగే మంచి క్యారెక్టర్ లను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఆ మూవీకి సంబంధించి కథ తో పాటు డైరెక్టర్ ని బట్టి కూడా తనకు వచ్చిన ఆఫర్లు ఓకే చేస్తున్నాడు. ప్రస్తుతం సార్ మూవీ విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. సుమంత్ కు ఈ మూవీ హిట్ చాలా హెల్ప్ అయ్యింది. మరి కొంత మంది దర్శక నిర్మాతలు తాము తీయబోయే నూతన చిత్రాలలో చేయమని సుమంత్ ను అప్రోచ్ అవుతున్నారు.
previous post
next post