అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ ను ప్రారంభించి, తర్వాత కమెడియన్ గా మారి నేడు హీరోగా కొనసాగుతున్న సప్తగిరి త్వరలో రాజకీయ అరంగేట్రం చేయబోతున్నట్టు ప్రకటించడంతో చిత్తూరు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చే మొదలయ్యింది. సప్తగిరి పొలిటికల్ ఎంట్రీ పై వైశాఖి డాట్ కాం గతంలోనే రాసింది.పుట్టి పెరిగిన చిత్తూరు జిల్లాకు మంచి చేయాలన్న సంకల్పంతో రాజకీయాలలోకి వస్తున్నట్లు సప్తగిరి స్పష్టం చేస్తున్న సప్తగిరి తనకు మొదటి నుంచి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అంటే చాలా ఇష్టమని మొదట్నుంచి తను టిడిపి అభిమానిగానే ఉన్నట్లు క్లియర్ కట్ గా ఏ పార్టీలోకి వెళ్లబోతున్నది చెప్పేశారు. టీడీపీ నుంచి సప్తగిరికి గట్టిహామీ లభించినట్లు తెలుస్తోంది.. చిత్తూరు లోని కీలక నియోజకవర్గం పూతలపట్టు నియోజకవర్గ టిక్కెట్ హామీ కూడా పార్టీ అధిష్టానం నుంచి లభించినట్లు తెలుస్తోంది.. టిడిపి ముఖ్య నేతలను అలాగే ఆ పార్టీ ముఖ్య నాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే, సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ తో కూడా ఎప్పటికప్పుడు టచ్ లో కూడా ఉంటున్న సప్తగిరి(అసలు పేరు వెంకట ప్రభు ప్రసాద్) ఇటీవల లోకేష్ పాదయాత్రలో కూడా పాల్గొని లోకేష్ ఆశీస్సులు కూడా తీసుకున్నారు. టిడిపి నుంచి పార్టీలో చేరాలనే కోరికా.. పిలుపు వున్నప్పటికీ తను పార్టీ చేరే వేదిక సందర్భం కోసం సప్తగిరి ఎదురుచూస్తున్నట్లు పాత్రికేయులకు చెప్పారు.వచ్చే ఎన్నికలలో చిత్తూరు నుంచి పోటీ చేయాలనే ప్రతిపాదనలు కూడా వస్తున్నాయని తాను పుట్టి పెరిగిన ఆ జిల్లాలో పోటీ చేసేందుకు తనకు ఆసక్తి ఉందని చెప్తున్న ఆ స్టార్ కమెడియన్ కు పార్టీ పూర్తి హామీ ఎప్పుడో ఇచ్చిందన్నది సమాచారం ఏదైనప్పటికీ పార్టీ ఆదేశాల మేరకు తనకు ఏ బాధ్యత అప్పగించిన దానిని స్వీకరించి క్రమశిక్షణతో, నిబద్ధతతో, నిక్కచ్చిగా వ్యవహరిస్తూ పార్టీ గౌరవాన్ని మరింత ఇనుమడింప చేసేందుకు ప్రయత్నిస్తానని విధేయత కూడా వ్యక్తం చేశాడు. 250 రూపాయలతో తో హైదరాబాద్ వెళ్లిన తాను నేడు తన ఆర్థిక పరిస్థితి కూడా మెరుగైందని అంతా తిరుమలేశుడి కృపా కటాక్షం అని సప్తగిరి చెప్పారు. రాజకీయాలలో పూర్తిస్థాయి ఏక్టివ్ గా ఉన్నప్పటికీ తనకు ఒక మంచి గుర్తింపును తీసుకొచ్చిన సినిమా ఇండస్ట్రీని వదిలే ప్రసక్తి లేదని చెప్పారు. పార్టీ అధిష్టానం నుంచి ఖచ్చితమైన పిలుపు కోసం తాను ఎదురు చూస్తున్నట్లు మరి కొద్ది రోజులలో అధికారికంగా టిడిపిలో చేరే అవకాశం ఉన్న సప్తగిరి మీడియా ముఖంగా అన్ని వివరాలు వెల్లడిస్తానని అంటున్నారు.
previous post
next post