డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం లో యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న హిట్ the third case షూటింగ్ వైజాగ్‌లో జరుగుతోంది. నాని సరసన హీరోయిన్ గా కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి నటిస్తోంది. వైజాగ్‌లో జరుగుతున్న షెడ్యూల్‌లో శ్రీనిధి శెట్టి షూట్‌లో జాయిన్ అయింది. ప్రస్తుతం, టీమ్ లీడ్ పెయిర్- నాని, శ్రీనిధి శెట్టికి సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. హిట్ ఆఫీసర్‌గా నాని క్యారెక్టర్ ని పరిచయం చేసిన గ్రిప్పింగ్ గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. నాని మేకోవర్, ఇంటెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్ అందరినీ సర్ ప్రైజ్ చేసింది. ప్రముఖ డీవోపీ సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ సమకూరుస్తున్నారు. ఈ మూవీకి కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్, శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్.
previous post
next post