ఊ అంటావా మావా… ఉహూ అంటావా… అంటూ పుష్ప ది రైజ్‌తో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బ్లాక్‌బస్టర్ పాట అత్యంత ప్రజాదరణ పొందిన పాటలలో ఒకటిగా రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సౌత్ ఇండియా డ్యాన్స్ క్వీన్ శ్రీలీలతో కలిసి దుమ్ము రేపడానికి సిద్ధమాయ్యాడు. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ అందించిన ఈ పాట సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని శ్రీలీల గ్లామరస్ అవతార్‌లో కనిపించనున్నట్లు ఆమె ఎంట్రీ ని కన్ఫర్మ్ చేస్తూ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ లో స్పష్టమవుతుంది. త్వరలో విడుదల కానున్న ట్రైలర్‌తో పాటు స్పెషల్ సాంగ్‌కి సంబంధించిన అప్‌డేట్ ఇంట్రస్ట్ ని పెంచింది.
అల్లు అర్జున్, రష్మిక మందన్న ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలలో పుష్ప 2 ది రూల్ డిసెంబర్ 5, 2024న ప్రపంచవ్యాప్తంగా 11500 థియేటర్లలో విడుదల కానుంది.
previous post
next post