ఉప్పెనతో బ్లాక్ బస్టర్ డెబ్యు చేసిన సెన్సేషనల్ బుచ్చిబాబు సానాతో రాం చరణ్ కలిసి తన 16వ సినిమా చేయనున్నారు మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సగర్వ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై మెగా-బడ్జెట్, హై-క్లాస్ ప్రొడక్షన్, టెక్నికల్ వాల్యూస్ తో రూపొందే ఈ మోస్ట్ ఎవెయిటింగ్ ప్రాజెక్ట్ #RC16తో వెంకట సతీష్ కిలారు గ్రాండ్‌గా ఫిల్మ్ ప్రొడక్షన్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో వివిధ భాషలకు చెందిన పలువురు ప్రముఖ నటీనటులు కనిపించనున్నారు. తాజగా టీమ్ RC16 తెలుగు సినిమాకి కరునాడ చక్రవర్తి శివ రాజ్‌కుమార్ ఎరైవల్ ని సెలబ్రేట్ చేసుకుంటుంది. కన్నడ సూపర్ స్టార్ ఈ చిత్రంలో వెరీ పవర్ ఫుల్ రోల్ పోషించడానికి సైన్ చేశారు. శివ రాజ్‌కుమార్ పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ చేసారు. ఈ న్యూస్ తో ఇద్దరు స్టార్స్ అభిమానులు ఆనందంగా వున్నారు. ఇద్దరు సూపర్‌స్టార్‌లను కలిసి తెరపై చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినీమా కు ‘ పెద్ది ‘ అన్న పేరు ను పరిశీలిస్తున్నట్టు టాక్ రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా కనిపించనున్న ఈ మ్యాసీవ్ మూవీకి అకాడమీ-అవార్డ్-విన్నింగ్ కంపోజర్ AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఆర్ రత్నవేలు డీవోపీ కాగా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
previous post