Vaisaakhi – Pakka Infotainment

సిరివెన్నెల కి నివాళిగా ‘నా ఉచ్ఛ్వాసం కవనం’

దిగ్గజ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి నివాళిగా రూపొందిన నా ఉచ్ఛ్వాసం కవనం ఈటీవీలో ప్రతి ఆదివారం ఉదయం 9.30 గంటలకు ప్రసారం కానుంది. ఈ కార్యక్రమం కర్టెన్ రైజర్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ ఈ కార్యక్రమానికి హాజరై టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీ రామ్ చెరువు మాట్లాడుతూ 2011లో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని కలిశాం. ఆయన దగ్గరకు ఎవరు వెళ్లినా ముందు తన పాట ఒకటి పాడి వినిపిస్తుంటారు. అలా మాకు కొన్ని పాటలు వినిపించారు. అవి సూపర్ హిట్ సాంగ్స్ కాదు కానీ సాహిత్యపరంగా ఎంతో విలువైన పాటలు. ఆ పాటలు , ఆ పాటల వెనక సీతారామశాస్త్రి గారు చేసిన కృషి గురించి తెలుసుకున్న తర్వాత ఈ మాటలు మాకే కాదు అందరికీ తెలియాలనే ఆలోచన కలిగింది. సిరివెన్నెల అంతరంగం పేరుతో నాలుగు ఎపిసోడ్స్ చేశాం. సీతారామశాస్త్రి గారు తన పాట గురించి వివరించిన తర్వాత ఆ పాటను సింగర్స్ పాడేవారు. కొన్ని రోజుల తర్వాత మ్యూజిక్ లేకుండా సింగర్స్ తో కేవలం లిరిక్స్ పాడించాం. మూడు ఎపిసోడ్స్ అనుకున్నది 13 ఎపిసోడ్స్ చేశాం. దీన్ని టీవీ, ఇతర మాధ్యమాల ద్వారా బహుళ ప్రచారంలోకి తీసుకురావాలని అనుకున్నప్పుడు ఇతర పనులతో బిజీగా ఉండి శాస్త్రి గారు ఆసక్తి చూపించలేదు. ఆ తర్వాత కోవిడ్ వచ్చింది. కొన్ని రోజులకు సీతారామశాస్త్రి గారు మనకు దూరమయ్యారు. ఆ తర్వాత ఈ ప్రోగ్రాంను ఎలా ప్రేక్షకులకు చేర్చాలి అనుకుంటున్నప్పుడు త్రివిక్రమ్ గారు మాకు సపోర్ట్ చేశారు. ఈటీవీలో ప్రసారం గురించి బాపినీడు గారు ఎంతో సపోర్ట్ చేశారు. నాతో పాటు మా టీమ్ లోని వాళ్లంతా శాస్త్రి గారి అభిమానులే. సీతారామశాస్త్రి గారి మాట అందరికీ చేరాలని చేసిందే ఈ చిన్న ప్రయత్నం. మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాం. అన్నారు.
సీనియర్ దర్శకుడు కృష్ణవంశీ మాట్లాడుతూ సీతారామశాస్త్రి గారి పరిచయం ఒక అదృష్టంగా భావిస్తా.
నేను ఏ సినిమా మొదలుపెట్టినా ముందు సీతారామశాస్త్రి గారి దగ్గరకు వెళ్లి పాటల గురించి డిస్కస్ చేస్తుండేవాడిని. నా కొత్త సినిమా మొదలుపెట్టాలని ఆరేడు నెలల నుంచి ప్రయత్నిస్తున్నా. కానీ పాటలు ఏం చేయాలో అర్థం కావడం లేదు. శాస్త్రి గారు లేకపోవడం వల్ల అనాథగా మారిన భావన కలుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో
సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు,
సింగర్ పార్థసారధి,
డాక్టర్ గురువారెడ్డి తదితరులు ప్రసంగించారు

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More