అప్సర్ దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరొ గా గంగా ఎంటర్టైన్మంట్స్ బేనర్ పై రూపొందిన ‘శివం భజే’ చిత్రం ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, “వైవిధ్యమైన కథతో, సాంకేతిక విలువలతో చిత్ర విజయంపై మాకున్న విశ్వాసం మరింత పెరిగింది. మా మొదటి చిత్రం అనుకున్నట్టుగా రూపుదిద్దుకుంది. శివస్మరణతో మొదలైన మా చిత్రానికి ఆయన ఆశీస్సులతో అద్భుత స్పందన లభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ, ప్రతీ ఒక్కరు తమ కెరీర్ బెస్ట్ ఇవ్వడంతో ఈ చిత్రం మేము ఊహించిన దానికంటే అద్భుతంగా వచ్చింది. ఆ శివుని అనుగ్రహంతో పాటు మీ అందరి ఆశీర్వాదంతో త్వరలోనే మా చిత్రాన్ని మీ ముందుకి తెస్తాం” అన్నారు.
డివైన్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రానున్న దిగంగనా సూర్యవంశీ కథానాయక గా నటించారు. బాలివుడ్ నటుడు అర్బాజ్ ఖాన్, మురళీ శర్మ, తనికెళ్ళ భరణి, సాయి ధీన, అయ్యప్ప శర్మ, హైపర్ ఆది, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్ వంటి నటులు ముఖ్యమైన పాత్రలు పోషించారు.
previous post