Vaisaakhi – Pakka Infotainment

షణ్ముఖ డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ లో అవికాగోర్‌.

డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ గా ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌తో ష‌ణ్ముగం సాప్ప‌ని ద‌ర్శ‌కత్వం లో సాప్‌బ్రో ప్రొడ‌క్ష‌న్స్ బేనర్ పై సాప్ప‌ని బ్ర‌దర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో తుల‌సీరామ్ సాప్ప‌ని, ష‌ణ్ముగం సాప్ప‌ని, ర‌మేష్ యాద‌వ్ నిర్మిస్తున్న షణ్ముఖ చిత్రంలో క‌థానాయిక‌గా నటిస్తున్న అవికాగోర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా చిత్రంలో ఆమె లుక్‌ను రివీల్ చేస్తూ ఓ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు మేక‌ర్స్‌. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు మ‌ట్లాడుతూ ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని ఓ అద్భుత‌మైన పాయింట్‌తో రూపొందుతున్న డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ ఇది. విజువ‌ల్ వండ‌ర్‌లా, అద్బుత‌మైన గ్రాఫిక్స్‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాం. ఈ చిత్రంలో క‌థానాయిక అవికాగోర్ స‌ర పాత్ర‌లో సాహ‌సోపేత‌మైన ప‌నులు చేసే శ‌క్తివంత‌మైన అమ్మాయి పాత్ర‌లో క‌నిపించ‌నుంది. లక్ష్య సాధ‌న‌లో ఆది పాత్ర‌కు స‌పోర్ట్ చేస్తూ ఆయ‌నకు తోడుగా నిలిచే పాత్ర‌. త‌ప్పకుండా ఆమె కెరీర్‌లో ఈ పాత్ర , సినిమా మ‌రిచిపోలేని చిత్రంగా నిలిచిపోతుంది. ఈ చిత్రంలో అవికాగోర్ త‌న న‌ట‌న‌తో అంద‌రి హృద‌యాల‌ను హ‌త్త‌కుంటుంది. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో ఈ చిత్రం కోసం ఎంతో రిచ్‌గా వేసిన ఓ సెట్‌లో చివ‌రి షెడ్యూల్‌ను పూర్తిచేసాం. కేజీఎఫ్‌, స‌లార్ చిత్రాల‌కు త‌న సంగీతంతో ప్రాణం పోసిన ర‌వి బ‌సూర్ ఈ చిత్రానికి స్ట‌నింగ్ మ్యూజిక్‌ను అందిస్తున్నారు. ప్ర‌స్తుతం అత్యున్న‌త సాంకేతిక నిపుణుల‌తో నిర్మాణనంత‌ర ప‌నులు మొద‌లుకానున్నాయి. విజువ‌ల్ ఎఫెక్ట్స్‌, గ్రాఫిక్స్ విష‌యంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుని, ఓ వండ‌ర్‌ఫుల్ మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుక‌రావ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాం. త‌ప్ప‌కుండా ఈ చిత్రం ఆది కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోతుందన్నారు.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More