అవురమ్ ఆర్ట్స్ పతాకంపై మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందిస్తూ సుమన్ చిక్కాల దర్శకత్వంలో బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మాణం లో క్వీన్ ఆఫ్ మాసెస్’ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “సత్యభామ” థియేట్రికల్ ట్రైలర్ ను ఈ నెల 24న హైదరాబాద్ లో నటసింహం బాలకృష్ణ చేతుల మీదుగా రిలీజ్ చేయబోతున్నట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు. బాలకృష్ణ అతిథిగా వస్తుండటంతో “సత్యభామ” మూవీకి మరింత క్రేజ్ ఏర్పడటం ఖాయమని చెప్పుకోవచ్చు.“సత్యభామ” సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్.
next post