మన సినీమా తో మంత్ ఎండ్ అదిరిపోతుంది. మీ అందరితో కలసి సినిమా ఇక్కడే చూస్తాను. మీ అందరికీ ప్రేమకి థాంక్. మీరు ఇలానే ప్రేమ చూపిస్తూ వుంటే వందశాతం కష్టపడి మీకు మంచి మంచి సినిమాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తునే వుంటానని నేచురల్ స్టార్ నాని అన్నారు. వివేక్ ఆత్రేయదర్శకత్వం లో ‘సరిపోదా శనివారం’. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. సుదర్శన్ థియేటర్ నాకు చాలా స్పెషల్. మీ అందరితో కలసి ఈ ట్రైలర్ చూడటం చాలా హ్యాపీగా వుంది. ఈ సినిమా నుంచి ఒక డైలాగ్ చెప్పాలంటే.. ‘నాకు కోపం వచ్చింది, నాకు కోపం వచ్చిందటే వీళ్ళు నా మనుషులు, వాళ్ళ సమస్య నా సమస్య. వాళ్ళ సంతోషం నా సంతోషం’. అందుకే ఈ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఇక సెలబ్రేట్ చేసుకుంటూనే ఉందాం. థాంక్ యూ సో మచ్. ఆగస్ట్ 29న సరిపోదా శనివారం. థియేటర్స్ లో సెలబ్రేట్ చేసుకుందాం’ అన్నారు, యాక్టర్ ఎస్ జే సూర్య మాట్లాడుతూ నాని గారు కష్టపడి వచ్చారు. మీ అందరి సపోర్ట్ తో ఎదిగారు. ఆయన మంచి మనిషి. ఆయన మంచి మనసుకు ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. చాలా మంచి కంటెంట్ వున్న సినిమా ఇది. మంచి ఎనర్జీ వున్న సినిమా ఇది. తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది’ అన్నారు. హీరోయిన్ ప్రియాంక మోహన్ నిర్మాత డి.వి.వి.దానయ్య హర్షిత్ రెడ్డి మాట్లాడారు..
టీజర్ సినిమాలోని రెండు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ని పరిచయం చేయగా, ట్రైలర్ కాన్ఫ్లిక్ట్ ని ప్రజెంట్ చేసింది. సిఐ దయానంద్ చిన్న చిన్న కారణాలతో ఇతరులపై దాడి చేసే క్రూరమైన వ్యక్తి. సాధారణ మధ్యతరగతి కుర్రాడైన సూర్య తన చుట్టూ ఉన్నవారికి అన్యాయం జరిగితే సహించలేడు. ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఇంటెన్స్ వార్ ని ట్రైలర్ అద్భుతంగా ప్రజెంట్ చేసింది.