ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో సంతోష్ శోభన్ హీరోగా యూవీ కాన్సెప్ట్స్ నిర్మిస్తున్న మూవీ “కపుల్ ఫ్రెండ్లీ”. సంతోష్ శోభన్ పుట్టినరోజు సందర్భంగా బర్త్ డే విషెస్ తెలియజేస్తూ స్పెషల్ గ్లింప్స్ తో పాటు ఈ సినిమా టైటిల్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. “కపుల్ ఫ్రెండ్లీ” చిత్రంలో మిస్ ఇండియా మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది.
లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అజయ్ కుమార్.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటైన్స్ డే సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నారు. “కపుల్ ఫ్రెండ్లీ” టైటిల్ లుక్ లో చెన్నై సెంట్రల్ స్టేషన్ దగ్గరలోని ఓ రెసిడెన్షియల్ ఏరియాను చూపించారు. చెన్నై బ్యాక్ డ్రాప్ లో సాగే ఇంట్రెస్టింగ్ మూవీగా “కపుల్ ఫ్రెండ్లీ” ఉండబోతోంది.
బర్త్ డే విషెస్ తో అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.4 ఎనౌన్స్మెంట్.
సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్, “కలర్ ఫొటో”తో నిర్మాతగా తన అభిరుచి చాటుకున్న దర్శకుడు సాయి రాజేశ్ సంయుక్త నిర్మాణంలో అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై సంతోష్ శోభన్, సోషల్ మీడియా ఫేమ్ అలేఖ్య హారిక హీరో హీరోయిన్లుగా ప్రొడక్షన్ నెం.4 సినిమా తెరకెక్కుతోంది. హీరో సంతోష్ శోభన్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ పై కొన్ని ‘ప్రేమ కథలు జీవితకాలం వెంటాడుతాయి..’ అనే హార్ట్ టచింగ్ క్యాప్షన్ ఆకట్టుకుంటోంది. సంతోష్ శోభన్ లుక్ ఇంటెన్స్ గా ఉంది. ఈ చిత్రానికి సుమన్ పాతూరి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు మూవీ టీమ్ సిద్ధమవుతోంది.