Vaisaakhi – Pakka Infotainment

రెండూ హిట్టే అంటున్న మెగాస్టార్

సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్న బాలకృష్ణ వీర సింహారెడ్డి మూవీ కూడా హిట్ కొడుతుందని మెగాస్టార్ చిరంజీవి అంటున్నారు సంక్రాంతి రోజే తన సినిమా వాల్తేరు వీరయ్య కూడా రిలీజ్ అవుతుందని కచ్చితంగా ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యి తెలుగు ఇండస్ట్రీ కి మంచి పేరును తీసుకొస్తాయని పేర్కొన్నారు. విశాఖలో జరిగిన వాల్తేర్ వీరయ్య ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి ఎటువంటి భేషజాలకు పోకుండా తన తోటి సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన మూవీ కూడా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ రెండు చిత్రాలకు ఒక్కరే నిర్మాత కావడం ఈ సినిమా ప్లాప్ అయినా నిర్మాతకు భారీ నష్టం తప్పదు. భారీ బడ్జెట్ తో ఈ రెండు చిత్రాలను నిర్మించిన నిర్మాతలకు మరింత నష్టం రాకూడదని ఆ చిత్రాలు విజయవంతమయి నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టాలని చిరు పేర్కొన్నారు. బయట మాత్రం నందమూరి, మెగా ఫ్యాన్స్ సంక్రాంతికి మా హీరో సినిమా సూపర్ హిట్, లేదు మా హీరో సినిమా నే సూపర్ హిట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఘర్షణ పడుతున్నారు. కొందరు వ్యక్తిగతంగా తమ అభిమాన హీరోలకు అనుకూలంగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీనికి తోడు ఈ రెండు చిత్రాలు సంబంధించి సాంగ్స్ కానీ టీజర్, ట్రైలర్స్ గాని ఒకదాని తర్వాత ఒకటి వరుసగా రిలీజ్ చేస్తూ వచ్చారు. మొన్ననే ఒంగోలులో బాలకృష్ణ వీర సింహారెడ్డి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. నేడు విశాఖలో చిరంజీవి వాల్తేర్ వీరయ్య ఈవెంట్ కూడా జరిగింది. ఈ రెండు ఈవెంట్లకు లక్షలాదిగా అభిమానులు తరలివచ్చారు. సాంగ్స్, ట్రైలర్లు చూస్తుంటే ఈ రెండు చిత్రాలు ఖచ్చితంగా బాక్సాఫీస్ ను షేక్ చేస్తాయనిపిస్తున్నాయి. గతంలో ఇలాగే సంక్రాంతికి ఈ ఇద్దరు హీరోల చిత్రాలు రిలీజ్ అయ్యాయి. చిరంజీవి హిట్లర్ సినిమా, బాలకృష్ణ పెద్దన్నయ్య సినిమా లు సంక్రాంతికి రిలీజయి రెండు కూడా హిట్ చిత్రాలుగా నిలిచాయి. ఇదివరకు జరిగిన ఒక ప్రెస్ మీట్ లో చిరంజీవికి ఇదే విషయం ఒక జర్నలిస్టు ప్రస్తావించగా దానికి మెగాస్టార్ చిరు సమాధానం చెబుతూ కచ్చితంగా ఈసారి సంక్రాంతి రిలీజ్ అయ్యే వాల్తేర్ వీరయ్య, వీర సింహారెడ్డి చిత్రాలు సూపర్ హిట్ గా నిలుస్తాయని మళ్లీ గతం పునరావృతం అవుతుందని వెల్లడించారు. ఇటు అభిమానులైతే మా హీరో చిత్రం సక్సెస్ అవుతుందని, మీ హీరో చిత్రం బాగా ఆడదని గొడవలు పడుతున్నారు. అభిమానుల మధ్య గొడవలు ఇలా ఉండగా అటు బాలకృష్ణ కానీ ఇటు చిరంజీవికి కానీ ఈ రెండు చిత్రాలు విజయవంతమై నిర్మాతకి లాభాలు తెచ్చి పెట్టాలని ఆశిస్తున్నారు. చిరంజీవి మాత్రం మీడియా ముఖంగా పలుసార్లు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. రెండు చిత్రాల కథలలో దమ్ము ఉందని ఇక వేరే ఏ ఆలోచన లేదని వాల్తేర్ వీరయ్య, వీర సింహారెడ్డి చిత్రాలు హిట్ కొట్టడం ఖాయమని స్పష్టం చేస్తున్నారు.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More