సుదీర్ఘ కాలం హాస్పిటల్ కి పరిమితమైన సమంత మళ్ళీ మేకప్ వేసుకుంది. తనకు హిందీ లో క్రేజ్ ని తీసుకొచ్చిన ఫ్యామిలీ మ్యాన్ దర్శకద్వయం రాజ్ అండ్ డికె తీస్తున్న సిటడెల్ వెబ్ సీరీస్ షూటింగ్ కోసం ముంబై వచ్చేసింది. వరుణ్ ధావన్ తో పాటు విజయ్ సేతుపతి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ వెబ్ సీరీస్ కోసం డేట్లు అడ్జెస్ట్ చేసిన సమంత విజయ్ దేవరకొండ ఫాన్స్ కు ట్విట్టర్ వేదికగా క్షమాపణ చెప్పారు.. చాలా రోజుల నుంచి వెయిటింగ్ లో ఉన్న ఖుషీ చిత్రానికి డేట్లు ఇవ్వకుండా హిందీ వెబ్ సీరీస్ షూటింగ్ లో పాల్గొనడం పట్ల విజయ్ దేవరకొండ ఫాన్స్ బగ్గుమన్నారు.. వాళ్ళు అలా ఫైర్ అయ్యేసరికి ఖుషీ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుందని వారికి ఊరట కలిగించే కబురు అందించింది. భారీ అంచనాలున్న సిటడెల్ పై అమెజాన్ ప్రైమ్ భారీ రేంజ్ లో ఖర్చు పెడుతోంది. మిగిలిన వాటికి డేట్స్ అడ్జస్ట్ చేయకుండా ఈ షూటింగ్ లో పాల్గొనడానికి సిటాడెల్ లో ఉన్నవాళ్ళంతా పెద్ద ఆర్టిస్టులు కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో డేట్లు అడ్జస్ట్ చెయ్యవలసి వచ్చిందని తెలుస్తోంది. ఇక ఫిబ్రవరి 17న విడుదల కావాల్సిన శాకుంతలం ని వాయిదా వేశారు. నిజానికి అన్ని అనుకూలిస్తే ఖుషీ సినిమా డిసెంబర్ లొనే రిలీజ్ కావల్సి ఉంది. ఊహించని విధంగా సమంత అనారోగ్యానికి గురికావడంతో బ్రేక్ పడింది. మైత్రీ మూవీస్ శివ నిర్వాణ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే 70శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ప్రేమ కధా చిత్రానికి దాదాపు90 కోట్లు ఖర్చయిందని సమాచారం.. ఈ చిత్రాన్ని భారీ ఫ్యాన్సీ రేటు కి ఓటీటీ కి ఇప్పటికే విక్రయించేశారని తెలిసింది. అన్నీ కుదురుకున్నాక సమంత షూటింగ్ లో జాయిన్ అయితే ఖుషీ ఈ సమ్మర్ కే పాన్ ఇండియా ఫిల్మ్ గా ప్రేక్షకులను పలకరించనుంది.
previous post
next post