డార్లింగ్ ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సలార్ మూవీ రికార్డుల వేటకు సిద్ధమైంది ఈనెల 6న ఉదయం 5:12 నిమిషాలకు సలార్ టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారకంగా ప్రకటించింది. అటు సోషల్ మీడియా కానీ ఇటు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కానీ రికార్డులను సెట్ చేయడం ప్రభాస్ కే చెల్లింది. పూర్తిగా నెగటివ్ టాక్ వచ్చిన ఆది పురుష్ మూవీ ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 500 కోట్లు పైగా వసూలు చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఒకవేళ అదే సూపర్ హిట్ అయితే కలెక్షన్ 1000 కోట్లు దాటే అవకాశం ఉండేది. ఆది పురుష్ మూవీ తర్వాత వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఫిలిం సలార్ మాత్రం బాక్సాఫీస్ వద్ద సంచనాలను సృష్టిస్తుందని ఇప్పటికే సినీ విశ్లేషకులు చెబుతున్నారు. హోంబలే సంస్థ నిర్మిస్తోన్న సలార్ సినిమాను ‘కేజీయఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ‘కేజీయఫ్’ సూపర్ సక్సెస్ తర్వాత హోంబాలే, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మరోమారు రిపీట్ కానుండడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జూలై 6న 90 సెకన్ల సునామీ రికార్డుల వేటను షురూ చేస్తుందని అభిమానులు పేర్కొంటున్నారు. ప్రభాస్ పెర్ఫార్మెన్స్, ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ బాక్సాఫీస్ ని షేక్ చేయడం గ్యారెంటీ అని సినీ ప్రేక్షకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రవి బస్రూర్ మార్క్ బిజీఎం ఇచ్చి 90 సెకన్ల టీజర్ కట్ ను మరో లెవెల్ కి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ టీజర్ అన్ని భాషలలో కూడా రికార్డ్ వ్యూస్ ను కొల్లగొడుతుందని అంచనా వేస్తున్నారు. అయితే గతేడాదే సలార్ సినిమా విడుదల కావాల్సింది. కానీ కరోనా మహమ్మారి కారణంగా లెక్కలన్నీ తలకిందులయ్యాయి. దీంతో ఇది ఈ సినిమా విడుదలపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ 28న థియేటర్లో విడుదల చేయనున్నట్టు మేకర్స్ గతేడాదే ప్రకటించారు. చిత్ర యూనిట్ అధికారికంగా టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా టీజర్ కోసం అని వెయిట్ చేస్తున్నారు.
previous post
next post