Vaisaakhi – Pakka Infotainment

సెప్టెంబర్ లో సలార్ – జవాన్ ల బిగ్ ఫైట్

ఒకే నెలలో కోద్ధి రోజుల గ్యాప్ తో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ – పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ బాక్స్ ఆఫీస్ వద్ద నయా వార్ కు సిద్ధమవుతున్నారు. బాలీవుడ్ లో సూపర్ స్టార్ గా వెలుగుతున్న షారుక్ ఖాన్ కు పోటీగా విడుదలవుతున్న ప్రభాస్ సినిమాలు బాలీవుడ్ లో రికార్డులను సృష్టిస్తున్నాయి. ఎంతలా అంటే సార్ బాలీవుడ్ స్టార్ హీరోలు అందరిని వెనక్కి నెట్టే అంతలా. ఇక్కడే అసలు సమస్య మొదలయ్యింది. నిన్న మొన్న బాలీవుడ్ కి బాహుబలి తో వచ్చిన ప్రభాస్ షారుక్ తో పోటీ పడటమే అక్కడి జనాలకు నచ్చడం లేదు. బాలీవుడ్ లో హృతిక్ రోషన్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణబీర్ కపూర్, లు వంటి స్టార్ హీరోలు ఉన్నప్పటికీ షారుక్, అమీర్, సల్మాన్ ల సినిమాలకు ఉన్నంత క్రేజ్ వారికి లేదు. నిజం చెప్పాలంటే ఈ ముగ్గురు స్టార్ హీరోలే బాలీవుడ్ ని రూల్ చేస్తున్నారు. ఎక్కడో సౌత్ నుంచి వచ్చిన ప్రభాస్ ఇప్పుడు ఈ ముగ్గురు ఖాన్ హీరోలకు ఎదురు నిలబడి ఊహించని స్థాయిలో తన సినిమాల ద్వారా వసూళ్లను కొల్లగొడుతున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన ప్రభాస్ ఆది పురుష్ సినిమా రిజల్ట్ పై మిశ్రమ స్పందన వచ్చిన సరే కలెక్షన్ లో మాత్రం దుమ్ము దులిపేస్తుంది. మూడు రోజులకు వరల్డ్ వైడ్ గా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించిన 340 కోట్ల లెక్కలను యాంటీ ఫ్యాన్స్ తప్పుడు లెక్కలు అంటూ కొట్టి పారేస్తున్నప్పటికి పఠాన్ మూవీ మొదటి రోజు కలెక్షన్లు 106 కోట్ల కాగా, ప్రభాస్ ఆది పురుష్ మూవీ మొదటి రోజు కలెక్షన్ లో 140 కోట్లు.. అన్న మేటర్ జీర్ణించుకోలేకపోతున్నారు. సినిమా రిలీజ్ కి ముందే వారం రోజుల వరకు అన్ని ప్రాంతాలలో టిక్కెట్లు ఆన్లైన్ ద్వారా బుక్ కావడంతో అదిపురుష్ సినిమాకి భారీగా కలెక్షన్ లు వస్తున్నాయన్నది తెలుస్తుంది. ఖాన్ హీరోలను దాటి ప్రభాస్ ముందుకెళ్లడం తట్టుకోలేని అక్కడి యాంటీ ఫ్యాన్స్ అదేపనిగా అది పురుష్ సినిమా రిలీజ్ దగ్గర నుంచి సోషల్ మీడియా వేదికగా నెగిటివ్ ప్రచారం చేస్తూనే ఉన్నారు. దీంతో షారుక్ – ప్రభాస్ ఫాన్స్ మధ్య నయా వార్ స్టార్ట్ అయ్యింది. షారుక్ నెక్స్ట్ మూవీ తానే నిర్మాతగా వ్యవహరిస్తూ తమిళ్ డైరెక్టర్ అట్లీతో కలిసి తీస్తున్న జవాన్ మూవీ హిందీ తో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషలలో కూడా రిలీజ్ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా ఈ సంవత్సరం సెప్టెంబర్ 2న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా కూడా కూడా ప్రకటించారు. మరోపక్క కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ – ప్రభాస్ కాంబోలో రూపొందుతున్న సలార్ మూవీ కూడా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. ఈ సినిమా కూడా హిందీ తో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషలలో ఈ ఏడాది సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. జి రెండు సినిమాల కోసం ఆ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య అప్పుడే సోషల్ మీడియాలో కలెక్షన్ల కోసం వార్ స్టార్ట్ అయింది. ఇండియన్ సినిమాల గత చరిత్రను తిరగరాసి షారుక్ జవాన్ మూవీ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని నార్త్ ఆడియన్స్ ముఖ్యంగా కామెంట్ చేస్తున్నారు. మరోపక్క ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఏమాత్రం తగ్గకుండా షారుఖ్ ఖాన్ బాలీవుడ్ కే బాద్షా మాత్రమే కానీ ప్రభాస్ మాత్రం ఇండియన్ సినీ ఇండస్ట్రీకి బాద్షా అంటూ కౌంటర్ కామెంట్లు పెడుతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే షారుక్ మూవీలు బాలీవుడ్ లో తప్ప ఇతర భాషలో పెద్దగా ఆడింది లేదు. గతంలో ఎప్పుడో కొన్ని చిత్రాలు మాత్రం సౌత్లో డబ్ అయ్యి కాస్తో, కూస్తో కలెక్షన్లు సంపాదించి పెట్టాయి. కానీ టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి తో లెక్కలన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. బాహుబలి సిరీస్ ద్వారా ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే సరికొత్త రికార్డులను సృష్టించాడు. ఈ సినిమాల విజయంతో ప్రభాస్ నేషనల్ స్టార్ గా మారిపోయాడు. ఇప్పుడు ఒక్కో సినిమాకు వంద నుంచి 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ గా రికార్డులకెక్కాడు. బాహుబలి సినిమా ద్వారా అన్ని ప్రాంతీయ భాషలలో ప్రభాస్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అదే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. కానీ బాలీవుడ్ యాంటీ ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ కు వస్తున్న గుర్తింపును తట్టుకోలేకపోతున్నారు. షారుక్ ఖాన్ కు పోటీగా ప్రభాస్ ఎదురు నిలబడడం అక్కడి జనం జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం అయితే షారుక్ కంటే ప్రభాస్ కే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉందన్నది వాస్తవం. ప్రభాస్ సలార్ మూవీ కూడా ప్లాప్ అవుతుందని షారుక్ జవాన్ ఇండియన్ సినీ చరిత్రలో రికార్డులను సృష్టిస్తుందని నార్త్ ఇండియన్స్ అంటే ప్రధానంగా షారుఖ్ ఫ్యాన్స్ విపరీతంగా సోషల్ మీడియాలో అదేపనిగా మెసేజ్ లు చేస్తున్నారు. అయితే కేజిఎఫ్ సిరీస్ ని మించి సలార్ మూవీ వరల్డ్ వైడ్ గా భారీ కలెక్షన్లు సాధిస్తుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. జవాన్ మూవీ 1000 కోట్ల పైగా కలెక్షన్లు వసూలు చేసిన దానిని మించి ప్రభాస్ సలార్ మూవీ ఎక్కువగానే కలెక్షన్లు వసూలు చేస్తుందని విశ్లేషిస్తున్నారు. షారుక్ ఖాన్ బాలీవుడ్ కింగ్ అంటూ.. ఇండియన్ సినీ ఇండస్ట్రీ కి బాద్షా అంటూ అతని అభిమానులు చేస్తున్న మెసేజ్ లపై ప్రభాస్ ఫ్యాన్స్ కూడా గట్టిగానే సమాధానం చెబుతున్నారు. ఒరిజినల్ గా హీరో ప్రభాస్ క్షత్రియుడని అతను పుట్టుకతోనే రాజు అని కింగ్ అనే బిరుదు అతికించుకోవాల్సిన అవసరం లేదని సలార్ మూవీ అన్ని ప్రాంతీయ భాష లతో తోపాటు హిందీలో కూడా కలెక్షన్ ల సునామి సృష్టిస్తుందని దానికోసం వేచి చూడాలంటూ కౌంటర్ మెసేజ్ లు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే షారుక్ – ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. సోషల్ మీడియా వేదికగా ఒకరి హీరోని మరొకరు తిట్టిపోస్తూ మెసేజ్ లు చేస్తున్నారు. సెప్టెంబర్ నెల మాత్రం ఇద్దరి హీరోల సినిమాల రిలీజ్ లతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పెద్ద యుద్ధమే జరగబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో ఎవరు విన్నర్ అన్నది కాలమే సమాధానం చెబుతుంది.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More