సినిమావాళ్లు తీసిన మూవీస్ కి పాత్రికేయులు ఇంతవరకు రివ్యూ లు రాశారు.. ఇప్పుడు మా పాత్రికేయ మిత్రులు తీసిన చిత్రానికి రివ్యూ రాస్తానని ప్రముఖ నిర్మాత దిల్ రాజు చెప్పారు.. సంహిత్ ఎంటర్టైన్మెంట్స్, పారుపల్లి ప్రొడక్షన్ బ్యానర్లపై నిర్మాతలు డా. మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి సంయుక్తంగా జర్నలిస్ట్ ప్రభు నిర్మాణ సారథ్యంలో , సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా హరినాథ్ పులి దర్శకత్వం వహించిన రేవు చిత్రం ఆగస్ట్ 23న రిలీజ్ కానున్న క్రమంలో జరిగిన ట్రైలర్‌ను లాంచ్ ఈవెంట్ లో ముఖ్య అతిథిగా విచ్చేసిన దిల్ రాజు ఈ వ్యాఖ్యలు చేశారు.
‘కొత్త వాళ్లు.. కొత్త వాళ్లతో ప్రయోగం చేస్తూనే ఉంటారు. కానీ 99 శాతం ఫెయిల్యూర్.. వన్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది. మురళీ వంటి వారు కొత్త వాళ్లతో సినిమాను చేశారు. కానీ ప్రభు, పర్వతనేని రాంబాబు వెనకాల ఉండి ఈ సినిమాను తీశారు కాబట్టి.. నేను ముందుండి నడిపించాలని అనుకున్నట్లు చెప్పారు. సీనియర్ దర్శకులు కోదండ రామిరెడ్డి ,రేలంగి నర్సింహారావు , నిర్మాత రామ సత్యనారాయణ , జర్నలిస్ట్ ప్రభు , నిర్మాత మురళీ , ప్రసన్న కుమార్ , దామోదర ప్రసాద్ , ఛాంబర్ అధ్యక్షులు భరత్ భూషణ్ , డీఎస్ రావు నటుడు ప్రదీప్ తదితరులు మాట్లాడుతూ చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.