సంహిత్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నవీన్ పారుపల్లి సమర్పణలో సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా మరో సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు ప్రొడక్షన్ పర్యవేక్షణలో డా. మురళీ గింజుపల్లి నిర్మాత గా హరినాథ్ పులి దర్శకత్వం లో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “రేవు” సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ మూవీ టీమ్ ఫ్యాషన్ షో మరియు స్పెషల్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో చిత్ర బృందంతో పాటు మురళీ మోహన్, ఆర్జీవీ, అనన్య నాగళ్ల, సంపత్ నంది, ఉత్తేజ్ గెస్టులుగా పాల్గొని సందడి చేశారు. మురళీ మోహన్ మాట్లాడుతూ.. రేవుల దగ్గర జీవనం గడిపే మత్య్సకారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా వడ్డీ వ్యాపారులు వారి శ్రమను దోచుకుంటారు. చేపలను వారు చెప్పిన రేటుకే కొనాలని షరతులు విధిస్తారు. మత్స్యకారుల జీవితాల్లోని ఇలాంటి ఇబ్బందులను నేపథ్యంగా ఎంచుకుని రేవు సినిమా చేయడం మంచి ప్రయత్నం అన్నారు. స్టార్స్ ఉన్న సినిమా హిట్ అవడం కంటే కొత్త వాళ్లతో చేసిన సినిమా హిట్ అయితే ఆ కిక్కే వేరు. ఆ సంతోషం ఈ చిత్ర నిర్మాతలకు దక్కాలని కోరుకుంటున్నానన్నారు దర్శకుడు ఆర్జీవీ మాట్లాడుతూ… రేవు సినిమా టైటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. నేను చూసిన ఈ సినిమా కంటెంట్ ప్రకారం రేవు నేపథ్యంగా సాగే మత్స్యకారుల జీవితాలు, వారి లైఫ్ లో జరిగే ఈవెంట్స్ తో ఈ సినిమాను తెరకెక్కించారని అనుకుంటున్నాను. రేవు నేపథ్యంగా కంప్లీట్ గా ఒక సినిమా వచ్చినట్లు నాకు గుర్తులేదని చెప్పారు. హీరోయిన్ అనన్య నాగళ్ల మాట్లాడుతూ.. రేవు సినిమా గురించి చాలా ఎగ్జైటింగ్ విషయాలు వింటున్నా. ఈరోజు ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో రేవు సినిమా పార్టీ చేసుకోవడం, ఈ ఈవెంట్ లో నేను పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. దర్శకుడు సంపత్ నంది, నటుడు ఉత్తేజ్, నిర్మాత డాక్టర్ మురళి గింజుపల్లి, జర్నలిస్ట్ ప్రభు తదితరులు పాల్గొని ప్రసంగించారు.
previous post
next post