ఆగస్టు రెండో వారంలో గ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న సినిమా రేవు. సంహిత్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్, పారుపల్లి ప్రొడక్షన్ పై నిర్మాత డా. మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి సంయుక్తంగా నిర్మిస్తుండగా నిర్మాణ సూపర్ విజన్ జర్నలిస్ట్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు వ్యవహరిస్తున్నారు.. హరినాథ్ పులి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న రేవు చిత్రం
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రే త్వరలో థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – సినిమా ప్రమోషన్ లో జర్నలిస్ట్ లు ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు తెలుసు. ప్రభు గారు నాకు చాలా కాలంగా పరిచయం. నేను శ్రీహరి గారి దగ్గర ఉన్నప్పటి నుంచి ప్రభు గారు తెలుసు. డైరెక్టర్ గా నన్ను ముందు నుంచీ ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు, అలాగే పర్వతనేని రాంబాబు గారు కూడా మంచి మిత్రులు. వీరిద్దరు కలిసి మరో మిత్రుడు మురళీ గింజుపల్లి గారితో కలిసి “రేవు” సినిమా చేస్తున్నారు. సినిమా విజువల్స్ చాలా బాగున్నాయి. సినిమాటోగ్రాఫర్ ప్రతిభ చూపించారు. ఈ సినిమాకు ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అంతా కొత్త వారు చేశారు. యంగ్ టీమ్ అంతా కలిసి ఈ సినిమాకు పనిచేయడం ఇంతమంది కొత్త వాళ్లకు “రేవు” సినిమాలో అవకాశం ఇవ్వడం నాకు ఆనందంగా ఉంది. ఓటీటీలో మనం ఏదైనా మంచి కంటెంట్ మూవీ వస్తే చూస్తాం కదా అలా “రేవు” ఆకట్టుకుంటుంది. టీమ్ లోని ప్రతి ఒక్కరికి మంచి పేరు, అలాగే నిర్మాతకు డబ్బులు తీసుకుని రావాలని కోరుకుంటున్నా. అన్నారు. నిర్మాణ పర్యవేక్షణ చేస్తున్న జర్నలిస్ట్ ప్రభు చిత్ర దర్శకుడు హరినాథ్ పులి ఎగ్జిక్యూటివ్ నిర్మాత పర్వతనేని రాంబాబు, నిర్మాతలు డా॥ మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి రచయిత ఈ కార్యక్రమంలో ఆర్టిస్టులు ఇతర చిత్ర బృందం పాల్గొన్నారు.
previous post