స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటించిన “సత్యభామ” సినిమా డిజిటల్ ప్రీమియర్ కు వచ్చేసింది. ఈ సినిమా అమోజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నెల 7వ తేదీన థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన ఈ చిత్రం లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ సత్యభామగా కాజల్ అగర్వాల్ నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఓ హత్యకేసులో ఎమోషనల్ అయిన సత్యభామ ఆ కేసును ఒక ఛాలెంజ్ గా తీసుకుని ఎలా సాల్వ్ చేసింది, బాధితురాలికి ఎలా న్యాయం చేసింది అనేది ఈ సినిమాలో హార్ట్ టచింగ్ గా, ఇంటెలిజెంట్ గా చూపించారు. సత్యభామలో కాజల్ అగర్వాల్ యాక్షన్ సీక్వెన్సులు హైలైట్ అయ్యాయి. థియేటర్ కంటే ప్రైమ్ వీడియోలోనూ మరింత మంచి రెస్పాన్స్ వస్తుందని మూవీ టీమ్ ఆశిస్తున్నారు.
నెట్ ఫ్లిక్స్ లో “భజే వాయు వేగం”
అలాగే ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన “భజే వాయు వేగం”. గత నెల 31న థియేటర్స్ లో రిలీజైన ఈ సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. “భజే వాయు వేగం” సినిమాను నెట్ ఫ్లిక్స్ లో చూస్తున్న ఆడియెన్స్ మూవీలో తమకు నచ్చిన సన్నివేశాల స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషించారు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు.