మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’ టీజర్ విడులయింది.
80, 90s లో TDK 120 నిమిషాల క్యాసెట్‌ల నాస్టాల్జిక్ ని గుర్తు చేస్తూ ప్రారంభమైన టీజర్ లో రవితేజ భాగ్యశ్రీ బోర్స్‌ల స్వీట్ అండ్ డిలైట్ ఫుల్ రొమాంటిక్ సీక్వెన్స్ మెస్మరైజ్ చేస్తుంది. తర్వాత టీజర్ రవితేజ ఫోకస్ చేస్తూ, అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ తన టీంతో, పవర్ ఫుల్ వ్యక్తిపై రైడ్ కి లీడర్షిప్ వహించే ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా అద్భుతంగా ప్రజెంట్ చేసింది.
పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ నాస్టాల్జిక్ చార్మ్ గా మలిచారు. క్యారెక్టర్స్, రొమాంటిక్ మూమెంట్స్, హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లు, ప్రతి ఎలిమెంట్ కంప్లీట్ ఎంటర్ టైన్మెంట్ ని ప్రామిస్ చేస్తోంది.
రవితేజ యూత్ ఫుల్ ఎనర్జీ, చార్మ్ తో స్క్రీన్ పై అద్భుతమైన మార్క్ వేశారు. భాగ్యశ్రీ బోర్స్ సంప్రదాయ దుస్తుల్లో అలరించింది, లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ టీజర్ ఫస్ట్ హాఫ్ లో కీలకంగా నిలిచింది. తరువాతి పార్ట్ రవితేజ, జగపతి బాబుల మధ్య జరిగిన ఘర్షణను ప్రజెంట్ చేసింది. జగపతి బాబు పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. వైవా హర్ష, నెల్లూరు సుదర్శన్ పాత్రలు హ్యుమర్ కి హింట్ ఇస్తున్నాయి.
అయనంక బోస్ సినిమాటోగ్రఫీ పిరియడ్ సెట్టింగ్ ఎసెన్స్ ని అద్భుతంగా చూపించాయి. మిక్కీ J మేయర్ మెస్మరైజింగ్ స్కోర్ మ్యజికల్ లేయర్ ని యాడ్ చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉంటూ అద్భుతమైన అనుభూతిని అందించాయి. రోమాన్స్, యాక్షన్ , ఎంటర్ టైన్మెంట్ బ్లెండ్ తో మిస్టర్ బచ్చన్ మెమరబుల్ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ నిఅందించడానికి సిద్ధంగా ఉన్నారని టీజర్ సూచిస్తుంది. బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ సినిమా ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్. టిజి విశ్వ ప్రసాద్ గ్రాండ్‌గా నిర్మించిన ‘మిస్టర్ బచ్చన్’ ఆగస్ట్ 15న విడుదల కానుంది.