తెలుగు సినిమాను తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయకుండా మిగతా ప్రాంతాలకు తీసుకెళ్లాలన్న ఇన్సిపిరేషన్ కల్గించిన హీరో సూర్య అని దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి చెప్పుకొచ్చారు.. ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ‘కంగువ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన ఎస్ఎస్ రాజమౌళి ఈ వ్యాఖ్యలు చేశారు. గజినీ టైమ్ లో సూర్య తన సినిమాలను తెలుగులో ప్రమోట్ చేసుకోవడం, తెలుగు ప్రేక్షకుల దగ్గరకు చేర్చడానికి చేసిన ప్రయత్నాన్ని కేస్ స్టడీగా నా ప్రొడ్యూసర్స్, హీరోలకు చెబుతుండేవాడిని. తెలుగు ప్రజల ప్రేమను సూర్య ఎలా పొందాడో, మనం కూడా తమిళ ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజల ప్రేమను పొందాలని చెబుతుండేవాడిని. నేను పాన్ ఇండియా మూవీస్ చేసేందుకు స్ఫూర్తినిచ్చింది సూర్యనే.
సూర్య నేను గతంలో ఓ సినిమా చేయాలనుకున్నాం. కుదరలేదు. సూర్య ఒక ఫంక్షన్ లో చెప్పాడు అతను నాతో సినిమా చేయడాన్ని మిస్ అయ్యానని, కానీ సూర్యతో సినిమా చేసే అవకాశం నేను మిస్ అయ్యాను. సూర్య నటన, ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ నాకు చాలా ఇష్టం. సూర్య ఫిలింమేకర్స్ కంటే స్టోరీస్ ను సెలెక్ట్ చేసుకుని జర్నీ చేస్తున్నాడు. అతని డెసిషన్ ను గౌరవిస్తాను. ఒక సినిమాను గొప్ప లొకేషన్ కు వెళ్లి షూట్ చేయడం కష్టం. క్రూ అంతా అక్కడికి తీసుకెళ్లాలి. పెద్ద స్టూడియోలో షూటింగ్ చేయడం కూడా కష్టమే. కానీ కంగువ సినిమాను చాలా రేర్ లొకేషన్స్ లో సెట్స్ వేసి మరీ షూట్ చేశారు. మీరు పడిన కష్టం మేకింగ్ వీడియోలో తెలుస్తోంది. మీ టీమ్ కష్టమంతా సినిమా రిలీజ్ అయ్యాక విజయం రూపంలో ప్రతిఫలంగా దక్కుతుందని నమ్ముతున్నాను. కంగువ లాంటి సినిమాను థియేటర్స్ లోనే చూడాలి. అప్పుడే ఆ సినిమాటిక్ ఎక్సీపిరియన్స్ పొందుతారని ఈనెల 14న కంగువను థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.